నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటన తో వరుస సినిమాల లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా గా తెరకెక్కిన ‘బింబిసార’ సినిమా తో కళ్యాణ్ రామ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతా లో వేసుకున్నాడు.ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా త్వరలోనే తెరకెక్కబోతుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు.అయితే బింబిసార సినిమా సీక్వెల్ ఎప్పుడు మొదలు అవుతుందో క్లారిటీ లేదు. దీనితో కళ్యాణ్ రామ్ మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు… బింబిసారా సినిమా తరువాత కళ్యాణ్ రామ్ వరుసగా ప్రయోగాత్మక సినిమాలను చేస్తున్నాడు.ఇటీవలే అమిగోస్ సినిమా లో నటించి మెప్పించాడు.
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ అనే మూవీలో నటిస్తున్నాడు ఇందులో బ్రిటిష్ ప్రభుత్వం తరఫున పనిచేసే సీక్రెట్ ఏజెంట్గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు.ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తుంది.. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో విడుదల కానుంది. శ్రీకాంత్ విస్సా ఈ మూవీకి కథ, మాటలు మరియు స్క్రీన్ ప్లే ను అందించారు.ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ”మనసులో ఉన్న భావన.. ముఖంలో తెలియకూడదు. మొదడులో ఉన్న ఆలోచన.. మాటల్లో బయటపడకూడదు. అదే.. గూఢచారికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం” అని కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్ ఎంతో హైలెట్గా నిలిచింది. ఇక ఈ సినిమాను నవంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.నేడు స్వాతంత్ర్య దినోవ్సతాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. ఈ సినిమా 101 రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని ఆ పోస్టర్ ద్వారా తెలియజేసింది.