గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపోందుతుంది.. త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.. సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు.. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయ్యింది.. సినిమా మోస్ట్ వైలెన్స్, మాస్ గా ఉంటుందని చెప్పడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే షూటింగ్ అప్డేట్స్ ఇస్తున్నా ఎలాంటి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేయకపోవడంతో అభిమానులు వాటి గురించి అడుగుతున్నారు..
గత కొన్ని రోజులుగా దేవర టీజర్ రాబోతుందని సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా దేవర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ దేవర టీజర్ పై అప్డేట్ ఇచ్చి హైప్ పెంచారు. అనిరుధ్ తన ట్విట్టర్ లో.. దేవర టీజర్ కోసం ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నాను. అందరూ పులిని అభినందించాల్సిందే అని ట్వీట్ చేస్తూ, హీరో, డైరెక్టర్ పేర్లను ట్యాగ్ చేశాడు.. దాంతో దేవర సినిమా టీజర్ రెడీ అయిందని అర్థమైపోయింది. అనిరుధ్ దీనికి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడని తెలుస్తుంది.
ఇకపోతే ఇటీవల కళ్యాణ్ రామ్ కూడా డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో దేవర టీజర్ గురించి మాట్లాడారు. దేవర టీజర్ ఈ న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. దేవర సినిమాని రెండు పార్టులుగా ప్రకటిచగా మొదటి పార్ట్ ని 5 ఏప్రిల్ 2024లో రిలీజ్ చేస్తామని తెలిపారు. దేవర సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.. అలాగే హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో లు విలన్స్ గా నటిస్తున్నారు.. ప్రస్తుతం ఎన్టీఆర్ జపాన్ వెకేషన్ లో ఉన్నారు .. తిరిగి ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ సినిమా షూటింగ్ పాల్గొంటాడని సమాచారం..
#Devara teaser 👏👏👏@tarak9999 and #KoratalaSiva 🔥🔥🔥
Excited 🎶🥁🙌#AllHailTheTiger— Anirudh Ravichander (@anirudhofficial) December 26, 2023