NTV Telugu Site icon

Devara : దేవర.. కలెక్షన్లలో అస్సలు ఆగేదేలే?

Devara Review Ntv

Devara Review Ntv

Devara : దేవర బాక్సాఫీస్ దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదు. మిక్స్డ్ టాక్‌తో మొదలైన దేవర బాక్సాఫీస్ వేట.. ఫస్ట్ డే 172 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లోనే 304 కోట్లు వసూలు చేయగా.. ఫస్ట్ వీక్‌లో 405 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అన్నీ చోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయి లాభాల బాట పట్టింది. అయితే.. ఓవర్సీస్‌లో మాత్రం దేవర ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో దుమ్ముదులిపేస్తున్నాడు. ఇప్పటికే ఓవర్సీస్‌ ఇండియన్ మూవీస్‌లో టాప్ ప్లేస్ దక్కించుకున్న దేవర.. యూఎస్ మార్కెట్‌లో సాలిడ్ వసూళ్లను రాబడుతోంది. నార్త్ అమెరికాలో 5.6 మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్‌ క్రాస్ చేసి.. 6 మిలియన్ దిశగా వెళుతుంది. అంటే.. ఒక్క నార్త్ అమెరికాలోనే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే.. 47 కోట్లు రాబట్టిందన్నమాట. ఈ వీకెండ్‌లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

Read Also:Mallareddy Mass Dance: బతుకమ్మ సంబరాల్లో మల్లారెడ్డి మాస్ డ్యాన్స్

దీంతో.. నార్త్ అమెరికాలో దేవర బాక్సాఫీస్ నెంబర్ ఎక్కడ ఆగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇండియాలోను దేవర కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దసరా వరకు దేవరకు తిరుగులేదు. కాబట్టి.. దేవర మేకర్స్‌కు భారీ లాభాలు రావడం గ్యారెంటీ. ఇక ఆచార్యతో కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ చూసిన కొరటాల.. దేవరతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆచార్య తర్వాత కేవలం ఎన్టీఆర్ మాత్రమే కొరటాలను నమ్మాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు కొరటాల. దేవరతో తానేంటో చూపించాడు. అందుకే.. ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్‌లు చూసిన తనకు.. దేవర సక్సెస్ చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో దేవర పార్ట్ 1 నిర్మించారు. మరి లాంగ్ రన్‌లో దేవర ఎంత రాబడుతుందో చూడాలి.

Read Also:Gopi Chand : మరోసారి ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న గోపీచంద్