Devara : దేవర కోసం సరికొత్తగా ప్లాన్ చేస్తున్న కొరటాల…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకొని గ్లోబల్ స్టార్ గా మారారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం దేవర..ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రం లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని అండర్ వాటర్ యాక్షన్స్ సన్నివేశాలు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం దాదాపు కొన్ని నెలల తరబడి సెట్టింగ్స్ వేస్తూ సముద్ర గర్భం లో జరిగే యాక్షన్స్ సన్నివేశాలను కోసం సముద్రాన్ని తలపించేలా సరికొత్త టెక్నాలజీ ని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సీన్ కోసం చాలా మంది ఫైటర్లు కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాలు ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరగబోతున్నట్లు సమాచారం. అక్కడ కొన్ని సన్నివేశాలతో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను కూడా చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇంతవరకు చూడని సరికొత్త లుక్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారని మత్స్యకార గ్రామం చుట్టూ తిరిగే కథ అంశముగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా కోసం ప్రత్యేకంగా బీచ్ సేట్ ను రూపొందిస్తున్నారు. తీర ప్రాంతాన్ని తలపించేలా కర్ణాటకలోని కొన్ని టాప్ బీచ్ ల లో టన్నుల కొద్ది ఇసుకని అలాగే కొన్ని బండరాళ్లను కూడా వివిధ ప్రాంతాల నుంచి తీసుకురాబోతున్నట్లు సమాచారం.ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5 న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Tags
- Devara
- Janhvi Kapoor
- koratala
- ntr
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?