పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ల పై ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.దేవర సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
దర్శకుడు కొరటాల దేవర సినిమాను కొన్ని యదార్ధ సంఘటన ల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.దళితుల పై అగ్రవర్ణాల వారు చేసిన మారణకాండ ను ఈ సినిమా లో చూపించబోతున్నట్లు ఇప్పటికే కొన్ని రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి.. ఇక ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ ను పక్కా మాస్ లుక్ లో చూపించాడు కొరటాల.. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తుండటం తో అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను ఎంపిక చేస్తూ దర్శకుడు ఈ సినిమాపై అంచనాలు పెంచేసాడు..అయితే తాజాగా ఈ సినిమా గురించి మరొక వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయని సమాచారం.. ఈ ఫ్లాష్ బ్యాక్ ను విజువల్ యాక్షన్ వండర్ గా తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు కొరటాల.ఇక ఈ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ క్రూరమైన లుక్ లో కనిపిస్తాడని సమాచారం.ఈ యాక్షన్ ఎపిసోడ్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తాయని సమాచారం..