Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Details Of The Cheating Case Registered Against Actress Ashu Reddy Its A Big Sketch

AshuReddy : నటి అషు రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు వివరాలు..పెద్ద స్కెచ్చే

Published Date :April 26, 2026 , 11:01 am
By subbarao kilari
AshuReddy : నటి అషు రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు వివరాలు..పెద్ద స్కెచ్చే
  • Follow Us :
  • google news
  • dailyhunt

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్ర తండ్రి ఏనుముల సత్యనారాయణ మూర్తి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు అషు రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన అంశాలు ఇవే..

తొలి పరిచయం : కామన్ ఫ్రెండ్స్ ద్వారా 2018లో ఓ పార్టీలో ధర్మేంద్రకు అషు రెడ్డి పరిచయమయింది. తాను నటినని అమెరికాలో మాస్టర్స్ చేశానని పరిచయం చేసుకుంది అషు రెడ్డి. అయితే ధర్మేంద్రకు అప్పటికే వివాహం అయ్యి విడాకుల ప్రక్రియలో ఉన్నారని తెలిసినప్పటికీ ఆమె అతడిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించింది.

Also Read

  • Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..
  • New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు 'షాక్'.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
  • Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
  • న్యూ లుక్‌లో YS Jagan.. యూరప్ టూర్‌కు బయల్దేరిన మాజీ సీఎం.!

ఆర్థిక సహాయం : తన అమెరికా చదువు కోసం తీసుకున్న లోన్లు ఉన్నాయని, తన తండ్రి ఆర్థికంగా సహకరించడం లేదని చెప్పి ధర్మేంద్ర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోవడం ప్రారంభించింది. ఆ డబ్బులతో ఆస్తుల కొనుగోలు చేసి విలాసవంతమైన జీవనం సాగిస్తూ తన తండ్రి పెళ్లికి అంగీకరించాలంటే తాను విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు చూపాలని నమ్మించి తన పేరు మీద ఖరీదైన కార్లు, బంగారం, స్థిరాస్తులు కొనిపించారు. రూ. 9.35 కోట్ల వసూలు:* 2020 నుండి 2025 మధ్య కాలంలో సుమారు 5 కిలోల బంగారం, విలాసవంతమైన కార్లు మరియు ఇతర ఆస్తుల రూపంలో మొత్తం 9.35 కోట్ల రూపాయలను ధర్మేంద్ర నుండి అషు రెడ్డి మరియు ఆమె కుటుంబ సభ్యులు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మణికొండలో ఫ్లాట్ : ల్యాంకో హిల్స్ సమీపంలోని అర్కా మణికొండలో రూ. 3 కోట్ల విలువైన ఫ్లాట్ కోసం రూ. 1.80 కోట్లు ధర్మేంద్రతో చెల్లించి ఆ ఫ్లాట్‌ను తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుంది అషు.

కుటుంబ సభ్యుల ప్రమేయం : అషు రెడ్డి సోదరి వివ్య రెడ్డి, తల్లి యశోద రెడ్డి మరియు తండ్రి వెంకట కృష్ణ కొయ్య కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని బాధితుడు పేర్కొన్నారు. వీరంతా ధర్మేంద్రను ‘అల్లుడు’ అని పిలుస్తూ అతడిని నమ్మించి డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. జాతకాలు కలవాలని చెప్పి అక్టోబర్ 2024లో వేణు స్వామి అనే జ్యోతిష్యుడిని కూడా కలిసినట్లు పత్రంలో ఉంది.

పెళ్ళికి నిరాకరణ : జూలై 2025లో పెళ్లి చేసుకోవాలని ధర్మేంద్ర ఒత్తిడి తెస్తుండడంతో అషు రెడ్డి పెళ్లికి నిరాకరించారు. దాంతో తన డబ్బు, బంగారం తిరిగి అడగగా.. పెళ్లి చేసుకోనని, డబ్బులు ఇవ్వనని తేల్చి చెప్పారు. అంతేకాకుండా తనపై తప్పుడు కేసులు పెడతానని బెదిరించినట్లు ఫిర్యాదులో వివరించారు. అషు రెడ్డికి నమ్మి శివ జయంత్ అనే వ్యక్తితో సంబంధం ఉందని, వీరంతా కలిసి పథకం ప్రకారం ‘హనీ ట్రాప్’ చేసి తన కుమారుడిని మోసం చేశారని సత్యనారాయణ మూర్తి ఫిర్యాదు చేశారు.

పోలీసు నమోదు: హైదరాబాద్ CCS పోలీసులు దీనిపై క్రైమ్ నెం. 78/2026 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తును ACP (EOW Team-1) కి అప్పగించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashu Reddy Case Hyderabad
  • Ashu Reddy cheating allegations
  • Ashu Reddy Honey Trap Case
  • Ashu Reddy latest news
  • CCS Hyderabad Crime No 78 2026

తాజావార్తలు

  • AshuReddy : నటి అషు రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు వివరాలు..పెద్ద స్కెచ్చే

  • IPL Historic Day: బ్యాట్స్‌మెన్‌ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్‌లు.. ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజు!

  • Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..

  • New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!

  • Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions