దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. రేపటి నుంచి సికింద్రాబాద్ విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ లో కూడా కోచ్‌లు పెంచనున్నారు. ఇకపై రైళ్లో 3 ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు, 17 చైర్ కార్‌లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. ఇందులో అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు ఉన్నాయి. ఈ రైళ్ల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Ravichandran Ashwin: హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు.. అశ్విన్ వ్యాఖ్యలపై నెటిజన్స్ సీరియస్!
ఈనెల 10, 12, 15, 17 తేదీల్లో విశాఖపట్నంలో ఉదయం 09.45 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(08533) విజయవాడ 03.30PM, గుంటూరు 04.20 PM, సత్తెనపల్లి 05.45 PM, పిడుగురాళ్ల 06.20PM, నడికుడి 06.53 PM, చర్లపల్లి 10.30PM గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(08534) ఈనెల 11, 13, 16, 18 తేదీల్లో చర్లపల్లిలో 12.30AM గంటలకు బయలుదేరి నడికుడి 03.10AM, పిడుగురాళ్ల 03.29AM, సత్తెనపల్లి 03.55AM, గుంటూరు 04.40 AM, విజయవాడ 05.45 AM, విశాఖపట్నం 02.20 PM గంటలకు వెళ్తుంది. అదేవిధంగా ఈనెల 10, 11, 15, 16 తేదీల్లో విశాఖపట్నంలో 06.20PM గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(08537) విజయవాడ 11.30 PM, గుంటూరు 12.20AM, సత్తెనపల్లి 12.47 AM, పిడుగురాళ్ల 01.20AM, నడికుడి 01.52AM, చర్లపల్లి 08.00AM గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(08538) ఈనెల 11, 12, 16, 17 తేదీల్లో చర్లపల్లిలో 10.00 గంటలకు బయలుదేరి నడికుడి 12.33PM, పిడుగురాళ్ల 12.48 PM, సత్తెనపల్లి 01.28PM, గుంటూరు 02.30 PM, విజయవాడ 03.20 PM, విశాఖపట్నం 10.00 PMకు చేరుకుంటుంది.
READ MORE: CM Revanth Reddy : 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నాం..