NTV Telugu Site icon

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ సూపర్‌హిట్ పథకం..115 నెలల్లో మీ డబ్బు రెట్టింపు

Post Office

Post Office

సురక్షితమైన పథకాలలో పెట్టుబడి పెట్టాలని ప్రజలు ప్లాన్ చేస్తారు. తద్వారా వారు దీర్ఘకాలికంగా ఎక్కువ డబ్బుని పొందాలని ఆశిస్తారు. అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా అధిక వడ్డీ లభిస్తుంది. ఈ పోస్టాఫీసు పథకం కిసాన్ వికాస్ పత్ర (KVP).. ప్రస్తుతం ఈ పథకం కింద 7.5 శాతం వార్షిక వడ్డీని అందజేస్తున్నారు. కిసాన్ వికాస్ పత్ర అనేది భారత ప్రభుత్వంచే నిర్వహించబడే ఏకమొత్త పెట్టుబడి పథకం, దీని కింద వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన సవరించబడుతుంది. ఈ పథకంలో మీరు నిర్ణీత వ్యవధిలో మీ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. మీరు ఈ పథకంలో పోస్టాఫీసు లేదా పెద్ద బ్యాంకుల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ప్రభుత్వ పథకం కావడంతో ఇందులో ఎలాంటి ప్రమాదం లేదు. ఈ పథకం పోస్టాఫీసుకు లింక్ చేయబడింది. పోస్టాఫీసు ఈ పథకం మీకు హామీతో కూడిన రాబడిని అందిస్తుంది.

READ MORE: Bangladesh: ‘‘జమాతే ఇస్లామీ’’పై నిషేధాన్ని ఎత్తేసిన బంగ్లాదేశ్.. షేక్ హసీనా హయాంలో బ్యాన్..

పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర యోజన (కెవిపి) కింద రూ. 1000 నుంచి పెట్టుబడి ప్రారంభమవుతుంది. ఈ పథకం సంవత్సరానికి 7.5 శాతం చొప్పున రాబడిని ఇస్తుంది. గత సంవత్సరం ఏప్రిల్ 2023 లో దాని వడ్డీ రేట్లు 7.2 శాతం నుంచి 7.5 శాతానికి పెంచారు. ఇంతకుముందు ఈ పథకంలో డబ్బు రెట్టింపు కావడానికి 120 నెలలు పట్టేది. కానీ ఇప్పుడు డబ్బు 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల ఏడు నెలలలో రెట్టింపు అవుతుంది. అంటే 9 సంవత్సరాల 7 నెలల్లో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. మీరు ఏక మొత్తంలో రూ.6 లక్షలు పెట్టుబడి పెడితే ఈ కాలంలో ఈ మొత్తం రూ.12 లక్షలు అవుతుంది. ఈ పథకం కింద ఖాతాను తెరవాలనుకుంటే.. మీరు ఒక్కరే లేదా ఉమ్మడి ఖాతాలో కిసాన్ వికాస్ పత్ర ఖాతాను తెరవవచ్చు. పోస్టాఫీసు ఈ పథకం కింద ముగ్గురు వ్యక్తులు ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. అయితే ఈ పథకం కింద నామినీని జోడించడం తప్పనిసరి. మీకు కావాలంటే మీరు 2 సంవత్సరాల 6 నెలల తర్వాత ఈ ఖాతాను మూసివేయవచ్చు.