Deputy Collectors Association: రెవెన్యూ శాఖలో పదోన్నతులు కల్పించండి..
- రెవెన్యూ శాఖలో పదోన్నతులు కల్పించండి
- మంత్రి పొంగులేటిని కోరిన డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy Collectors Association: రెవెన్యూ శాఖలో అర్హులైన ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, కె.రామకృష్ణ కోరారు. పదోన్నతులు లభించకపోవడంతో ఏళ్ల తరబడి ఉద్యోగులు ఎదురు చూస్తున్నట్టుగా తెలిపారు. రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి గ్రామ స్థాయిలో అనుభవం ఉన్న వారికి అవకాశం కల్పించాలని కోరారు.
తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. రైతులకు మేలు చేసేలా, బలోపేతానికి ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొత్త ఆర్వోఆర్ చట్టం-2024 ముసాయిదా చాలా బాగుందని మంత్రికి కృతజ్ణతలు తెలిపారు. కొత్త ఆర్వోఆర్ చట్టంతో రైతులకు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ చట్టం దేశంలో ఉత్తమైన చట్టంగా మిగిలిపోతుందన్నారు. దీంతో పాటు ఇటీవల 9 మంది తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించినందుకు కూడా మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సైతం కొత్త ఆర్వోఆర్ చట్టం ముసాయిదాకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందించినందుకు సంఘం నేతలను అభినందించారు.
Also Read
- E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాహనాల బిల్లులను సైతం త్వరగా మంజూరు చేయాలని మంత్రిని కోరారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చేపట్టే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గ్రామానికో అధికారిని నియమించే దాంట్లో రెవెన్యూ శాఖలో అనుభవం ఉన్న వారికే అవకాశం ఇస్తే రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
తాజావార్తలు
-
E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!