NTV Telugu Site icon

Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఇష్యూపై డిప్యూటీ సీఎం కీలక ట్వీట్..

Pawan Kalyan

Pawan Kalyan

అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఇష్యూపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్‌లో స్పందించారు. అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వినియోగదారులు లేవనెత్తిన కొన్ని ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. అమెజాన్ వినియోగదారుల గడువు ముగిసిన గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ నాన్ ఆపరేటింగ్ ఖాతాలలోకి పోతుందని గ్రహించామన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన స్పందిస్తూ.. తన ఆఫీసు కూడా గడువు ముగిసిన గిఫ్ట్ కార్డ్‌ల నుండి కోల్పోయిన బ్యాలెన్స్‌ల సమస్యను ఎదుర్కొందని తెలిపారు. చాలా మంది వినియోగదారుల సొమ్ము చివరికి ఎటువంటి సహాయం లేకుండా అదృశ్యమవుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Read Also: Amaravati: సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనలో మార్పులు.. కొత్త టీంలు ఏర్పాటు..!

295 మిలియన్లకు పైగా భారతీయులు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను చురుగ్గా ఉపయోగిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. 1 బిలియన్+ గిఫ్ట్ కార్డ్‌లు అమెజాన్ ఇండియాలోనే కొనుగోలు చేయబడ్డాయన్నారు. ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలపై ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. అన్ని పీపీఐ (PPI)లు తప్పనిసరిగా కనీసం ఒక సంవత్సరం చెల్లుబాటును కలిగి ఉండాలని అన్నారు. ఒక సంవత్సరం పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్లయితే. ఖాతాని ముందస్తు నోటీసు తర్వాత మాత్రమే డియాక్టివేట్ చేయాలని తెలిపారు. బ్యాలెన్స్ తిరిగి చెల్లించబడుతుంది లేదా KYC-లింక్డ్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుందని పవన్ అన్నారు. అనవసరమైన నష్టాల నుండి వినియోగదారులను రక్షించడానికి పారదర్శకత, న్యాయబద్ధతను నిర్ధారించాలని కోరుతున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.

Read Also: Telangana: తెలంగాణలో సినిమా బెనిఫిట్‌ షోలు రద్దు!