NTV Telugu Site icon

Pawan Kalyan: కూటమి ఆరు నెలల పాలనలో అభివృద్ధిపై డిప్యూటీ సీఎం ట్వీట్..

Pawan Kalyan Speech

Pawan Kalyan Speech

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం, పారిశ్రామిక వాడలు సహా అనేక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులుగా వస్తున్నాయని.. ఇటీవల విశాఖపట్నం వేదికగా రూ.2.08 లక్షల కోట్ల పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని ట్వీట్ చేశారు పవన్..

కూటమి ఆరు నెలల పాలనపై పవన్ కల్యాణ్ స్పందించారు. హనీమూన్ పీరియడ్ ముగిసిందని ఇప్పటికే పవన్ ప్రకటించారు. తాజాగా ఈ ఆరు నెలల కాలంలో జరిగిన కార్యక్రమాలకు సంబంధించి పవన్ కీలక అంశాలు ట్వీట్ చేసారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన వివిధ పనులకు సైతం చంద్రబాబు సర్కార్ టెండర్లు ఆహ్వానించిందన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు సైతం ఊపందుకున్నాయి. కాగా, గత ఐదేళ్లపాటు వైసీపీ హయాంలో ఏపీ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే అన్నారు పవన్.

Trinadha Rao Nakkina: అన్నీ ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా.. హీరోయిన్ గురించి డైరెక్టర్ కామెంట్స్ వైరల్

నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన ఆరు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక మైలు రాళ్లను చేరుకుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కేవలం ఆరు నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో వైసీపీ ఐదేళ్ల పాలనకు మించి అభివృద్ధి చేసి చూపించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ ఐదేళ్ల పాలనతో పోలుస్తూ తాము చేసిన పనుల వివరాలను తెలుపుతూ పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు..

ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కొన్ని మైలురాళ్లు సాధించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీ పంచాయతీ రాజ్ శాఖ కింద వైసీపీ ఐదేళ్ల పాలనలో 1800 కి.మీ. మేర సీసీ రోడ్లు నిర్మిస్తే ఎన్డీయే అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే 3,750 కి.మీ. సీసీ రోడ్లు వేసినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో మినీ గోకులాలు కేవలం 268 ఏర్పాటు చేస్తే, తాజాగా ఆరు నెలల్లోనే 22,500 నిర్మించినట్లు వెల్లడించారు. పీవీటీజీ ఆవాసాల కోసం వైసీపీ రూ.91 కోట్లు ఖర్చు చేస్తే, తాము కేవలం ఆరు నెలల్లోనే రూ.750 కోట్లు ఖర్చు చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు

Show comments