Site icon NTV Telugu

Pawan Kalyan: షార్‌లో అంతరిక్ష వారోత్సవాలకు పవన్‌ కల్యాణ్ హాజరు

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటకు చేరుకున్నారు. షార్‌లో నిర్వహించనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుమార్తె ఆద్యతో కలిసి పవన్‌ వచ్చారు. షార్‌లో అంతరిక్ష వారోత్సవాలకు పవన్‌ కల్యాణ్ హాజరయ్యారు. రేణిగుంట విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. రేణిగుంటకు విమానంలో చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీహరికోటకు చేరుకున్నారు. ఎం.ఆర్. కురూప్ ఆడిటోరియంలో జరిగే అంతరిక్ష వారోత్సవాల్లో పాల్గొననున్నారు పవన్ కల్యాణ్.. అనంతరం షార్‌లోని వివిధ విభాగాలను సందర్శించనున్నారు.. పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

 

Read Also: Andhra Pradesh: ఫ్రీ హోల్డ్ స్కాంలో వెలుగులోకి మరో బాగోతం.. మంత్రి అనగాని సంచలన ప్రకటన

 

Exit mobile version