NTV Telugu Site icon

Pawan Kalyan: బహిరంగ సభలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్..

Pawan

Pawan

కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి సెంటర్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం తర్వాత తొలి బహిరంగ సభలో పాల్గొన్నారాయన. డిప్యూటీ సీఎంగా వారాహి మీద నుంచి తొలి ప్రసంగం చేశారు. తనను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా.. ఇదే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లు అందరూ భయంతో ఉండిపోయారు.. నేను కోరుకొని డిప్యూటీ సీఎం పదవి నాకు ఇప్పించారు.. అది మీకు అంకితం చేస్తున్నానని తెలిపారు. 100 శాతం స్ట్రైక్ రేట్ దేశంలో ఎవరూ సాధించలేదు.. పిఠాపురం ప్రజలు ఒక నాయకుడు వెంట ఉండి రాష్ట్రంలో 164 స్థానాలు గెలిచేలా చేశారని అన్నారు. రెండు చేతులు ఎత్తి మీకు నమస్కారం తెలియచేయాలి.. కూటమి కొరకు తనకు బాధ్యతలు ఎక్కువ అయిపోయాయని తెలిపారు. పిఠాపురం గెలుపు తనను ఉవ్విళ్ళరేలా చేసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

CM Chandrababu: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం..

తనను చాలా మంది హోమ్, ఫైనాన్స్, రెవెన్యూ తీసుకోమని అన్నారని.. కానీ, గ్రామ స్వరాజ్యం కోసం కష్టం అయిన పంచాయతీ రాజ్ తీసుకున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. మరోవైపు.. అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అన్నారు.. తాను విని వదిలేసానని.. మీరు చాలా సీరియస్ గా తీసుకున్నారని తెలిపారు. కన్నీరు తుడవలేని అధికారం ఎందుకు? అని ప్రశ్నించారు. అధికారులను బెదిరిస్తే పార్టీ పరంగా నాయకుల మీద క్రమ శిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తాను పిఠాపురం వాస్తవ్యుడని.. ఈ రోజు ఇక్కడ మూడు ఎకరాలు కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు. అంతేకాకుండా.. లంచాలు తీసుకోను.. తనకు అవసరం లేదని చెప్పారు.

Indian Bison : నల్లమలలో 150 ఏళ్ల తర్వాత అనుకోని అతిధి.. సంబరపడిపోతున్న జంతు ప్రేమికులు..

ఒక తల్లి తన వద్దకు వచ్చి.. నా బిడ్డ తొమ్మిది నెలలుగా కనిపించడం లేదని చెప్పిందన్నారు. తొమ్మిది నెలల్లో దొరకని బిడ్డ తొమ్మిది రోజుల్లో దొరికింది.. అలాగే, ముప్పై వేల మంది ఆడ బిడ్డలు అదృశ్యం అయితే గత ప్రభుత్వంలో ఒక్కరూ మాట్లాడలేదని పేర్కొన్నారు. సరైన నాయకత్వం ఉంటే సమస్యలు తక్కువ అవుతాయి.. గత ప్రభుత్వం మీద ప్రజలు విసిగిపోయారని పవన్ తెలిపారు. ఒక అరాచక ప్రభుత్వాన్ని కింద కూలదోసి మట్టిలో కలిపేశారని మండిపడ్డారు. 151 స్థానాలు ఉన్న వారికి 11 స్థానాలకి కుదించారంటే అది ప్రజా స్వామ్య విధానం అని పేర్కొన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో ఒక్క వాలంటీర్ లేకుండా పించన్లు పంపిణీ చేశామని పవన్ కళ్యాణ్ తెలిపారు. నా దగ్గర ఏమి ఉంది.. చంద్రబాబు దగ్గర అనుభవం ఉంది.. తాను మనుషులను కలవగలను.. కలపగలనన్నారు. తాను బాధ్యతలు తీసుకుని నెల అయింది.. అన్ని సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని తెలిపారు.