Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: సనాతనధర్మం ఒక మతోన్మాదం కాదు‌.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..

Pawan Kalyan

Pawan Kalyan

నేడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రం బయోడైవర్సిటీ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మరోసారి సనాతన ధర్మం ప్రత్యేకతను ప్రజలతో పంచుకున్నారు. పూర్వీకులు చెట్లను, నదులను పూజించేవాళ్ళని గుర్తు చేశారు. సనాతనధర్మం ఒక మతోన్మాదం కాదని వ్యాఖ్యానించారు.

READ MORE: Supreme Court: హద్దులు దాటుతున్నారు.. ఈడీ దాడులపై తీవ్ర ఆగ్రహం

ప్రకృతి నుంచీ తీసుకోవడమే కానీ ప్రకృతికి ఇవ్వడం అలవాటు లేకుండా పోయిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటామని హితవు పలికారు.. వినాయకచవితికి 54 రకాల ఔషధ మొక్కలని వినియోగిస్తామని.. 8 ఎకరాల నా పొలంలో దున్నడం మానేసి, అక్కడ సహజంగా పెరిగే మొక్కలు పెంచానన్నారు.. మన ఇంట్లో మనం ఏం చేయగలం అని ఆలోచించాలని.. కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం పెడితే ఎంత బలంగా పని చేస్తుందో చూడాలని పిలుపునిచ్చారు. ఒక చిన్న మొక్కను నాటడం గొప్ప పని.. వనజీవి రామయ్య జీవితం మొత్తంలో లక్షల మొక్కలు నాటారన్నారు.. సీడ్ బాల్స్ ను తయారు చేయడం ఎంతో అవసరమని చెప్పారు. మడ అడవులు సహజంగా ఏర్పడ్డాయి.. సముద్రం దగ్గర ఉంటూ మనలని రక్షిస్తాయని.. ఇటీవల మడ అడవులను కూడా నాశనం చేస్తున్నారని గుర్తు చేశారు.. తాను చిన్నపుడు స్కూలులో చూసిన చెట్టును కొట్టేసిన ఘటన తనకు మొక్కలు పెంచే ఆలోచన తెచ్చిందని తెలిపారు. చదువుకున్న మన విజ్ఞానం అహంకారాన్ని ఇచ్చింది.. ప్రకృతి పట్ల నిర్లక్ష్యం పెంచిందన్నారు.

READ MORE: CM Chandrababu: పంటలకు గిట్టుబాటు ధరపై సీఎం చంద్రబాబు సమీక్ష..!

మనందరి బాధ్యత జీవ వైవిధ్యం పెంచడం.. ఒక పార్టీనో, ఒక వ్యక్తినో మనం నిందించలేమని పవన్ కళ్యాణ్ అన్నారు. “మన అవసరాలకు ముందుగానే పది చెట్లు నాటి ఉంచాలి.. చెట్లను, నదులను పూజించేవాళ్ళు మన పూర్వీకులు.. నదులను పూజించేవాళ్ళు‌.. సనాతనధర్మం ఒక మతోన్మాదం కాదు‌.. జంతుజాలం మన అన్నదమ్ములు… మన జ్ఞానం మనం మర్చిపోకూడదు.. మనం మన రూట్స్ తెలుసుకోవాలి… చిన్న మార్పు చాలా పెద్ద మార్పులకు దారి తీస్తుంది. ప్రకృతిపై మనిషి చేసే యుద్ధం ఎలా ఉందో తెలుసు. తూర్పు కనుమలలో శేషాచలం, నల్లమల, పాపికొండలు మనకు ఇంకా ఉన్నాయి. నియంత్రణ లేకుండా అడవులను నాశనం చేస్తున్నారు. కోనాకార్పస్ మొక్కలలో ఒక్క పక్షి కూడా నివాసం ఉండదు.. ప్రతీ జిల్లాలో ఒక బయో డైవర్సిటీ పార్క్ ని ఏర్పాటు చేస్తాం. పర్యావరణ విద్యా కేంద్రాలుగా బయోడైవర్సిటీ పార్క్ ఉంటుంది. ఒక పల్లెవనం ఉండాలి ప్రతీ గ్రామంలోనూ… వందల ఎకరాలు ఇచ్చేస్తున్నాం కానీ బయోడైవర్సిటీకి కేటాయించడం లేదు.. మంగళగిరి చూస్తే చాలా బాగుంటుంది… నర్సరీలు పెంచేటప్పుడు అటవీశాఖ మార్గదర్శకాలు పాటించాలి… కోనాకార్పస్ ను ఉంచమని నర్సరీలు అడగడం అతిపెద్ద డ్యామేజీకి దారితీస్తుంది. కడియం నర్సరీలు కోనాకార్పస్ అమ్మకాలు ఆపడం గురించి ఆలోచించాలి. పక్షులు కూడా ఉండలేని మొక్కలు ఎలా అమ్ముతారు..” అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Exit mobile version