నేడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రం బయోడైవర్సిటీ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మరోసారి సనాతన ధర్మం ప్రత్యేకతను ప్రజలతో పంచుకున్నారు. పూర్వీకులు చెట్లను, నదులను పూజించేవాళ్ళని గుర్తు చేశారు. సనాతనధర్మం ఒక మతోన్మాదం కాదని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటు కానుంది. బయో డైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేసి ప్రజల్లో పర్యావరణం పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి దశలో విశాఖ, కాకినాడ, తిరుపతి, కడపలో నాలుగు బయో డైవర్సిటీ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒక్కో పార్కుకు రూ.కోటి, మ్యూజియానికి రూ.50 లక్షల చొప్పున జీవవైవిధ్య మండలి మంజూరు…