NTV Telugu Site icon

Kadapa: డిప్యూటీ సీఎం ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం.. విచారణ వేగవంతం

Kadapa Incident

Kadapa Incident

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగం విచారణ వేగవంతం చేసింది. సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో నాగేంద్ర అనే రైతు అప్పుల బాధ తాళలేక తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. నిన్న రిమ్స్ హాస్పిటల్‌లో ఎంపీడీవో జవహార్ బాబును పరామర్శించడానికి వచ్చిన డిప్యూటీ సీఎం దృష్టికి రైతు ఆత్మహత్య ఘటన వచ్చింది.

Read Also: Pawan Kalyan: నితీష్ కుమార్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసల వర్షం..

ఈ ఘటన పై ఆయన విచారం వ్యక్తం చేశారు. రైతు కుటుంబం మృతికి గల కారణాలను విచారణ చేసి.. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు పులివెందుల ఆర్డీఓ ఘటన స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలపై ఆరా తీశారు. నాగేంద్రకు అప్పు ఇచ్చిన ఎనిమిది మందిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే నాగేంద్ర మృతి చెందిన రోజు ఆయనకు 22 సార్లు ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకు నాగేంద్ర కుటుంబానికి 15 లక్షల రూపాయలు అప్పు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది.

Read Also: Manmohan Singh Cremation: పీవీకి మీరు చేసింది ఏమిటి..? కాంగ్రెస్‌‌వి చిల్లర రాజకీయాలు..

కాగా.. నిన్న (శనివారం) దిద్దేకుంట గ్రామంలో అప్పుల బాధ తాళలేక రైతు నాగేంద్ర దారుణానికి ఒడిగట్టాడు. భార్య, పిల్లలను చంపి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట భార్య వాణిని స్కూటర్ పై పొలం వద్దకు తీసుకెళ్లి తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత కొడుకు, కూతురును అదే విధంగా చంపేశాడు. కుటుంబ సభ్యులను హత్య చేసిన తర్వాత అదే తాడుతో ఆత్మహత్య చేసుకున్నాడు. కౌలుకు తీసుకుని పంటల సాగు చేసి అప్పుల పాలు కావడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Show comments