చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ముద్దిగుప్పం పంచాయతీలో జగనన్న స్వేచ్ఛ ఆరోగ్య కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. త్వరలో ఏపీలో ఎన్నికల నేపథ్యంలో నారాయణస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాను డబ్బులు ఇచ్చి ఓటు అడగని వ్యక్తిని అని అన్నారు. అంతేకాకుండా.. ఎలక్షన్ లో నిలబడి ఎవరి దగ్గర తాను ఒక రూపాయి తీసుకోలేదని చెప్పారు. ఏ పోస్టు అడిగిన తాను ఫ్రీగా చేశానన్నారు. కాంట్రాక్టర్ల దగ్గర తాను డబ్బు తీసుకోలేదని చెప్పారు.
Read Also: YSRCP: సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు
నియోజకవర్గంలో ఉన్న లీడర్ల అందరికీ పాదాభివందనం చేస్తున్నట్లు నారాణస్వామి తెలిపారు. తన నియోజకవర్గంలో డబ్బులు ఇస్తేనే మీకు ఓటు వేస్తామని ఎవరు అడిగింది లేదని చెప్పారు. ఇప్పుడు కొత్త సిస్టం వచ్చి తెలుగుదేశం వాళ్ళు ముందుగానే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారని దుయ్యబట్టారు. దళితవాడలోనే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు.
Read Also: BSS10: ప్రజాహితముకై జారీ.. పవన్ డైరెక్టర్ తో బెల్లంకొండ హీరో