NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: వరంగల్ జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం

Batti

Batti

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు (ఆదివారం) వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్‌ మహానగర పాలక సంస్థ పరిధిలోని 15వ డివిజన్‌లో విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి మొగిలిచెర్లలో శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా.. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ ప్రజాభవన్‌ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి మధ్యాహ్నం 1.45 గంటలకు హనుమకొండకు చేరుకుంటారు. అనంతరం 1.55 గంటల నుంచి 2.45 గంటల వరకు సుప్రభ హోటల్‌లో బస చేసి అక్కడి నుంచి ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ (ఐడీఓసీ)కు వెళ్లనున్నారు. అక్కడ మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 3.30 గంటల వరకు ఐడీఓసీ లో అధికారులతో సమావేశమై, సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను చర్చిస్తారు.

Also Read: Daaku Maharaj : డాకూ మహారాజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం.. భారీగా తరలి వచ్చిన అభిమానులు

ఆ తర్వాత మొగిలిచెర్లకు వెళ్లి గీసుకొండ మండలంలోని విశ్వనాథపురం, మొగిలిచెర్ల, గొర్రెకుంట ప్రాంతాల్లో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు శిలాఫలకాన్ని ప్రతిష్టిస్తారు. ఆపై సాయంత్రం 4.30 గంటలకు మొగిలిచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో విద్యుత్‌ సరఫరా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. మొత్తానికి నేడు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు వరంగల్‌ జిల్లాలో బిజీబిజీగా గడపబోతున్నారు.

Also Read: Game Changer Pre Release Event: ఒకే ఫ్రేమ్‌లో “బాబాయ్- అబ్బాయ్”.. గేమ్ చేంజర్ ఈవెంట్ ఫొటోస్ అదుర్స్..

Show comments