Site icon NTV Telugu

Ustad Bhagath Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం డేట్స్ ఇచ్చిన డిప్యూటీ సీఎం

Ustad Bagath Singh

Ustad Bagath Singh

పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమా భారీ అంచనాల మధ్య ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది . ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు  ఉండగా  విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది.

Also Read : Bellamkonda Sai Sreenivas : సమంతతో రొమాన్స్ చేస్తుంటే 200 మంది ఎగబడి చూసేవాళ్ళు

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మార్చి 22న అత్యంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అభిమానుల సమక్షంలో అవుట్ డోర్ లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి సినిమాకు మరింత హైప్ తీసుకురావాలని యూనిట్ భావిస్తోంది. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరవుతారని అంచనా. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ తన బిజీ షెడ్యూల్ లో కూడా ప్రత్యేకంగా రెండు రోజుల సమయాన్ని కేటాయించారని సమాచారం. ఆయన స్వయంగా ప్రమోషన్స్ లో దిగుతుండటంతో సినిమాపై అంచనాలు వేరే లెవల్ కు వెళ్తాయనడంలో సందేహం లేదు. ఇప్పటికే పోస్టర్లు, అప్డేట్లు మంచి స్పందన తెచ్చుకోగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాక్టివ్ ప్రమోషన్స్ సినిమాకు మరింత బూస్ట్ ఇవ్వనున్నాయి. OG తో బ్లాక్ బస్టర్ అందుకున్న పవర్ స్టార్ ఇప్పడు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ తో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.

Exit mobile version