Deputy CM Bhatti Vikramarka: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత పటిష్టంగా లే అవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)ను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన కార్యాలయలంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Read Also: CM Revanth Reddy: సెక్రటేరియట్‌లో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ఈ సమీక్షా సమావేశంలోనే ఎల్ఆర్‌ఎస్ విధివిధానాలపై పూర్తి స్థాయిలో కసరత్తు నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. ఎల్ఆర్ఎస్ అనుమతుల కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులు వీలైనంత వేగంగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందు కోసం 33 జిల్లాల్లో ప్రత్యేకంగా టీమ్‌లను రూపొందించుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డెప్యుటేషన్ కింద తీసుకోవాలన్నారు.