NTV Telugu Site icon

Bhatti Vikramarka: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Deputy CM Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్.. ఆ కోణంలో బ్యాంకర్లు దీర్ఘ దృష్టితో ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు వచ్చాయని.. త్వరలో టెండర్లు పిలుస్తామని ఆయన తెలిపారు. 2024 ఖరీఫ్ సీజన్‌లో రూ.54,480 కోట్ల రుణాలు లక్ష్యం కాగా 44,438 కోట్లు, 81.57 శాతం విడుదల చేశారన్నారు. రబీ రుణాల పంపిణీకి నెలరోజుల సమయం ఉన్నందున వేగం పెంచాలని కోరారు.

Read Also: Mission Bhagiratha : మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ లో కాల్ సెంటర్

రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల వ్యవధిలోనే 21 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద బ్యాంకులకు జమ చేశామన్నారు. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాబోయే ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ఆయన చెప్పారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి వారితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు.

Show comments