Site icon NTV Telugu

Depression: డిప్రెషన్ పెరిగితే ఇలా చేయండి.. తప్పకుండా రిలీఫ్ దొరుకుతుంది

Depressional

Depressional

Depression: ప్రస్తుతం మానవుడిది ఉరుకుల పరుగుల జీవితమైంది. టైంకు తిండి, నిద్ర లేదు. తిన్న కాసింతైన నాణ్యమైనది దొరుకుతుందా అంటే అదీ లేదు… అన్నింటా కాలుష్యం. తీరా గాలిపీల్చుకుందామనుకున్న పెరుగుతున్న పరిశ్రమలతో వాయుకాలుష్యం తీవ్రమైంది. దీంతో పీల్చే ప్రాణవాయువు విషతుల్యంగా మారుతోంది. దీని ఎఫెక్ట్ నేరుగా మన శరీరంపై పడుతోంది. కారణంగా శరీరంతో పాటు మెదడు దెబ్బతింటుందని పరిశోధనల్లో రుజువైంది. ముఖ్యంగా వాయు కాలుష్యం వల్ల మనుషుల్లో డిప్రెషన్ పెరుగుతోందని ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది.

వాయు కాలుష్యం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ చాలా మందికి ప్రత్యక్షంగా ఈ విషయం అర్ధం కాకపోవచ్చు. వాటిని క్షుణ్నంగా విశ్లేషిస్తేనే వాస్తవం మనకు తెలుస్తుంది. వాయు కాలుష్యం వల్ల ప్రజల జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. కాలుష్యం మనిషిలో డిప్రెషన్ పెంచుతుంది. వారిలో మానసిక సమస్యలను ప్రేరేపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చాలా మంది ఈ సమస్యలను కొట్టిపారేస్తారు. దీంతో ప్రమాదం మరింత పెరుగుతోంది.

Read Also: WPL 2023: ఢిల్లీ టీమ్‌కు షెఫాలీ.. మరి అప్పట్లో కోహ్లీని ఎందుకు తీసుకోలే!

కలుషిత ప్రాంతాల్లో నివసించే వ్యక్తులకు డిప్రెషన్ ప్రమాదం ఎక్కువగా ఉందని JAMA నెట్‌వర్క్ ఓపెన్‌ నివేదికలో తెలిపింది. దీర్ఘకాలికంగా కాలుష్య ప్రాంతాల్లో నివసించే వారిలో డిప్రెషన్ లెవల్ పెరుగుతుందని నివేదికలో పేర్కొన్నారు. మెడికేర్ ద్వారా తమ ఆరోగ్య బీమాను పొందిన 8.9 మిలియన్ల మంది వ్యక్తుల సమాచారాన్ని పరిశీలించారు. 2005 నుండి 2016 వరకు అధ్యయన కాలంలో 1.52 మిలియన్ల కంటే ఎక్కువ మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారని కనుగొన్నారు. కానీ ఈ సంఖ్య తక్కువ అని, ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Read Also: Bandi Sanjay: కేసీఆర్‌ ఇంకా ఈటల ఆయన మనిషి అనుకుంటున్నారు

వాయు కాలుష్యం పెరగడం వల్ల డిప్రెషన్‌, యాంగ్జయిటీ కేసులు కూడా పెరుగుతున్నాయని పరిశోధకులు తెలిపారు. దీని వల్ల చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. వాయు కాలుష్యం వల్ల డిమెన్షియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2019 సంవత్సరపు ప్రపంచ సమీక్షలో, వాయు కాలుష్యం మన శరీరంలోని ప్రతి భాగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని వెల్లడైంది. వాయు కాలుష్య ప్రభావం చిన్న పిల్లలు, వృద్ధులపై మరింత ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు విషపూరితమైన గాలి ఊపిరితిత్తులకు గుండెకు హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిప్రెషన్ తగ్గించుకునేందుకు సాధ్యమైనంత వరకు ప్రశాంత వాతావరణంలో ఉండేదుకు ప్రయత్నించండి. సాయంత్రాలు చల్లని నీడినిచ్చే చెట్లకింద రిలీఫ్ అవ్వండి. యోగాలాంటివి ప్రాక్టీస్ చేయండి.

Exit mobile version