WPL 2023: ఢిల్లీ టీమ్‌కు షెఫాలీ.. మరి అప్పట్లో కోహ్లీని ఎందుకు తీసుకోలే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురువారం జరిగిన విమెన్స్ ఐపీఎల్ ప్లేయర్ల వేలం ఘనంగా జరిగింది. మహిళా క్రికెటర్ల కోసం ఐదు ఫ్రాంచైజీలు పోటాపోటీగా పోరాడాయి. ఈ వేలంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్, అండర్-19 వరల్డ్ కప్ 2023 విన్నింగ్ కెప్టెన్, లేడీ సెహ్వాగ్‌గా పేరొందిన షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. షెఫాలీ కోసం ఆర్సీబీ కూడా తీవ్రంగా పోటీపడినప్పటికీ పట్టు వదలని ఢిల్లీ ఎట్టకేలకు ఆమెను దక్కించుకుంది. షెఫాలీని ఢిల్లీ తీసుకున్న తర్వాత సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర విషయం విపరీతంగా ట్రోల్ అయ్యింది.
Also Read: Juliet Rose: అత్యంత అరుదైన గులాబీ.. ధర రూ.112 కోట్లు..!
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఢిల్లీ క్యాపిటల్స్ గతంలోకి ఓసారి తొంగి చూస్తే.. ఈ ఫ్రాంచైజీ అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ల అడ్డాగా పేరొందింది. అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్‌ను జగజ్జేతగా నిలిపిన ఉన్ముక్త్ చంద్ 2011-13 మధ్యలో నాటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించగా.. 2018 అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన పృథ్వీ షా.. గత నాలుగు సీజన్లు ఢిల్లీ ఫ్రాంచైజీకే ఆడుతున్నాడు. వీరి తర్వాత భారత్‌ను అండర్-19 వరల్డ్‌కప్-2022 విజేతగా నిలిపిన యశ్ ధుల్‌ను 2022 ఐపీఎల్ సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కోటి రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. తాజాగా తొలి మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్ నెగ్గిన భారత యువ జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్లకు సొంతం చేసుకుంది.
Also Read: WPL 2023: ఐపీఎల్ వర్సెస్ విమెన్స్ ఐపీఎల్..కెప్టెన్లు ఒకేవైపు..గమనించారా?
అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. భారత అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్లపై అమితాసక్తి కనబరుస్తూ వస్తున్న ఢిల్లీ ఫ్రాంచైజీ, 2008 అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్, నేటి భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని మాత్రం ఎందుకో ఆర్సీబీకి వదిలేసింది. పైన పేర్కొన్న ఆటగాళ్లలో కొందరు ఢిల్లీకి చెందిన వారు కానప్పటికీ కొనుగోలు చేసిన డీసీ ఫ్రాంచైజీ.. కోహ్లీ ఢిల్లీ వాస్తవ్యుడైనప్పటికీ అతన్ని మిస్ చేసుకుంది. ఇప్పుడిదే విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!