NTV Telugu Site icon

Jammu-Kashmir Terror Attack :’పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించండి’.. మోడీ సూచన

Pakisthn Mp

Pakisthn Mp

గత నాలుగు రోజుల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య నాలుగు ఎన్‌కౌంటర్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితిని అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు. కేంద్రపాలిత ప్రాంతంలో శాంతిభద్రతలు, సాయుధ బలగాలు చేపడుతున్న ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల గురించి ప్రధానికి పూర్తి సమాచారం అందించారు. సాయుధ బలగాల తీవ్రవాద నిరోధక సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని ప్రధాని అధికారులకు సూచించారు. భారీ భద్రతా దళాలను మోహరించాలని తెలిపారు. భద్రతా బలగాల మోహరింపు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై ప్రధాని అమిత్ షాతో చర్చించినట్లు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ మనోజ్ సిన్హా తెలిపారు. గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా మాట్లాడిన ప్రధాని, కేంద్ర పాలిత ప్రాంతంలో పరిస్థితిని సమీక్షించారు. స్థానిక యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలను మనోజ్ సిన్హా ప్రధానికి తెలియజేశారు.

READ MORE: WhatsApp: 71 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సప్..ఎందుకో తెలుసా?

బుధవారం జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో తాజా ఎన్‌కౌంటర్ జరిగింది, ఇందులో ఒక సైనికుడు గాయపడ్డాడు. గత నాలుగు రోజుల్లో దోడాలో ఇది రెండవ దాడి. కేంద్రపాలిత ప్రాంతంలో నాలుగో దాడి. జూన్ 9న రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసి తొమ్మిది మందిని హతమార్చారు. ఒక రోజు ముందు, దక్షిణాదిలోని కతువా ప్రాంతంలో భద్రతా బలగాలు మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. కాగా.. దోడాలోని ఎత్తైన ప్రాంతాల్లో ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు ఉన్నారని, సవాళ్లతో కూడిన భూభాగంలో వారిని మట్టుబెట్టేందుకు సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కొండ జిల్లాలోని భదర్‌వా-పఠాన్‌కోట్ రహదారిలోని చత్తర్‌గల్లా ఎగువ ప్రాంతంలోని జాయింట్ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు మంగళవారం రాత్రి దాడి చేయడంతో ఐదుగురు రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది, ఒక ప్రత్యేక పోలీసు అధికారి (SPO) గాయపడ్డారు. ముట్టడిని పటిష్టం చేసేందుకు అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపించారు. దోడాలో గత 24 గంటల్లో ఇది రెండో ఉగ్రవాద ఘటన కాగా, మూడు రోజుల్లో జమ్మూ కాశ్మీర్‌లో నాలుగో ఉగ్రవాద ఘటన.

Show comments