పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతి పక్ష పార్టీలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత సోనియా గాంధీ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక, డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీల డిమాండ్ చేశారు.. వారికి మద్దతుగా సోనియా గాంధీ స్పందించారు.
Read Also: Extra Ordinary Man: ఓటీటీలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఎక్కడ స్ట్రీమింగంటే?
ఇక, 141 మంది విపక్ష ఎంపీలను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఖండించారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య గొంతు నొక్కింది అంటూ విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్నడూ లేనంత మంది ప్రతిపక్ష సభ్యులను లోక్‌సభ,రాజ్యసభల నుంచి సస్పెండ్ చేయడం సహేతుకమైనది కాదని ఆమె అన్నారు.
Read Also: Telangana Assembly: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశం
అయితే, డిసెంబరు 13న జరిగిన ఘటన క్షమించరానిది.. దానిని సమర్థించలేమని సోనియా గాంధీ అన్నారు. ప్రధాని మోడీ ఈ ఘటనపై తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి నాలుగు రోజుల సమయం పట్టింది అని ఆమె తెలిపారు. ప్రధాని సభ గౌరవాన్ని, దేశ ప్రజలను పట్టించుకోవడం లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది.. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిల్లులను ఈ సెషన్‌లో పార్లమెంట్ లో ఆమోదించారు.. జవహర్‌లాల్ నెహ్రూ లాంటి గొప్ప దేశ భక్తుల పరువు తీసే ప్రయత్నాలు జరిగుతున్నాయని ఆమె తెలిపారు. చారిత్రక వాస్తవాలను నిరంతరం వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు.. ఈ ప్రయత్నాలకు స్వయంగా ప్రధాని, హోంమంత్రి నాయకత్వం వహించినా మేం భయపడం, తలవంచబోం, నిజం చెప్పడానికి మేము కట్టుబడి ఉంటాము అంటూ సోనియా గాంధీ ప్రకటించారు.