NTV Telugu Site icon

Demi Moore: మొట్టమొదటి గోల్డెన్ గ్లోబ్‌ను అందుకున్న 62 ఏళ్ల నటి

Demi Moore

Demi Moore

Demi Moore: తాజాగా లాస్ ఏంజిల్స్‌లో 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నామినేట్ అయిన సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణుల నుండి విజేతలను ప్రకటించారు. ఇక ఫ్రెంచ్ మూవీ ‘ఎమీలియా పెరెజ్’ సినిమా 10 నామినేషన్స్ తో సత్తా చాటింది. అలాగే బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా కేటగిరీలో ‘ఓపెన్‌ హైమర్’ అవార్డును గెలుచుకుంది. ఇక ఆ సినిమాలో నటించిన ‘సిలియన్ మర్ఫీ’ బెస్ట్ మేల్ యాక్టర్ అవార్డును అందుకున్నాడు.

Also Read: OnePlus Buds Pro 3: సరికొత్త ఫీచర్లతో ఊహించని అనుభూతిని ఇచ్చేందుకు సిద్దమైన వన్‌ప్లస్

ఇక హాలీవుడ్ నటి ‘డెమీ మూర్’ తన మొట్టమొదటి గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాలు తన సిని కెరీర్ కోనసాగించిన నటి డెమీ మూర్ ఎట్టకేలకు తన 62 ఏట మొట్ట మొదటి గోల్డెన్ గ్లోబ్‌ను అందుకుంది. ‘ది సబ్‌స్టాన్స్’ మూవీతో ఉత్తమ నటిగా ఈ అవార్డ్ ని అందుకుంది. ఇక ఈ విషయాని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్యారా తెలుపుతూ.. ఈ రోజు నేను నిజంగా షాక్‌లో ఉన్నాను. ఈ గౌరవం, గుర్తింపు కోసం చాలా కాలంగా.. దాదాపు, 45 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. నా కల నేలవేరింది. ఇప్పుడు నేను నా కుటుంబం ఆనందం, ప్రేమ, కృతజ్ఞతతో నిండి ఉన్నాయని మూర్ భావోద్వేగంతో పోస్ట్ చేసింది.

Show comments