NTV Telugu Site icon

Gunfire Due To Pizza: పిజ్జా కోసం తుపాకీతో కాల్పులు.. మహిళా పరిస్థితి విషమం

Pizza

Pizza

Gunfire Due To Pizza: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పిజ్జా తినడంపై కుటుంబంలో తీవ్ర కాల్పులు జరిగాయి. ఈ మొత్తం వ్యవహారం సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని వెల్‌కమ్ ఏరియాలో జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య పిజ్జా పంపిణీపై వాగ్వాదం తర్వాత, ఒక మహిళను ఆమె తోడికోడలు సోదరుడు కాల్చాడు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Read Also: Manipur BJP MLAs: సీఎంగా బీరెన్ సింగ్‌ను తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్.. ప్రధానికి లేఖ

ఈ మొత్తం వ్యవహారం బుధవారం రాత్రి జరగగా.. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సద్మా అనే మహిళ బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో చేరినట్లు జీటీబీ ఆస్పత్రి నుంచి సీలంపూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బాధితురాలి భర్త సోదరుడు జీషాన్ బుధవారం కుటుంబ సభ్యులందరికీ పిజ్జా తెచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, జీషాన్ తన తమ్ముడు జావేద్ భార్య సద్మాతో సహా కుటుంబ సభ్యులందరికీ పిజ్జా ఇచ్చాడని అధికారి తెలిపారు. దీంతో జీషాన్ భార్యకు కోపం రావడంతో అక్కడ కాస్త గొడవ మొదలైంది.

Viral Video: దేవుడా.. ప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసిన ప్రియురాలు

జీషాన్ భార్య సాదియాకు సద్మాతో వివాదం ఇదివరకే ఉందని, ఈ విషయంపై వారి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. దాంతో రాత్రి సాదియా తన నలుగురు సోదరులు తఫ్సీర్ , ముంతహీర్, షాజాద్, గుల్రేజ్ సోదరులను ఇంటికి పిలవడంతో.. వారు వచ్చిన తర్వాత గొడవలు మరింత పెరిగాయి. ఈ సమయంలో ముంతహిర్ ఒక బుల్లెట్ కాల్చాడు. అది సద్మాను తాకింది. ఘటనలో సద్మా కడుపులో బులెట్ దిగడంతో ఆమెను జీటీబీ ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నట్లు జూచి పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలం నుంచి ముంతహీర్, తఫ్సీర్, షాజాద్, గుల్రేజ్‌ లను అదుపులోకి తీసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Show comments