NTV Telugu Site icon

Delhi Weather: ఢిల్లీని గజగజ వణికిస్తున్న చలి గాలులు.. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

New Project (47)

New Project (47)

Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం హెచ్చుతగ్గులకు లోనవుతోంది. మంచు గాలుల కారణంగా ఉష్ణోగ్రత మరింత పడిపోయింది. ప్రజలు వణికిపోతున్నారు. ఉష్ణోగ్రత మరింత తగ్గే అవకాశం ఉంది. శనివారం పొగమంచు కోసం వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఉదయం కొన్ని చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం, శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా. జనవరి 22, 23 తేదీల్లో దేశ రాజధానిలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

వాతావరణ శాఖ ప్రకారం, శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రత 8.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 1.2 డిగ్రీలు ఎక్కువ. గరిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలు, ఇది సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ తక్కువ. శుక్రవారం రోజంతా బలమైన చల్లని గాలులు వీస్తూనే ఉన్నాయి. ఉదయం పొగమంచు ఉంది. కానీ పగటిపూట వాతావరణం క్లియర్ అయ్యింది. ఢిల్లీ బయటి ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవరించి, విజిబిలిటీ తగ్గించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించింది.

Read Also:Saif Ali Khan: సైఫ్ రక్తంతో తడిసి, 8 ఏళ్ల కొడుకుతో సింహంలా నడుచుకుంటూ వచ్చాడు!

కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం.. శుక్రవారం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 294 వద్ద నమోదైంది, ఇది చాలా పూర్ కేటగిరీలో ఉంది. ఇంతలో ఢిల్లీ NCRలో కాలుష్య స్థాయిలు తగ్గుతున్న నేపథ్యంలో సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ GRAP-3 కింద ఆంక్షలను ఉపసంహరించుకుంది. ఈ వారం ప్రారంభంలో బలహీనమైన గాలులు, తక్కువ ఉష్ణోగ్రతలు, పొగమంచు ఈ ప్రాంతంలో కాలుష్యాన్ని మరింత తీవ్రతరం చేశాయి. దీని తరువాత కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) మూడవ, నాల్గవ దశల కింద కఠినమైన ఆంక్షలను విధించింది.

సున్నా నుంచి 50 మధ్య ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఉంటే మంచిది, 51 నుంచి 100 మధ్య సంతృప్తికరంగా, 101 నుంచి 200 మధ్య మధ్యస్థంగా, 201 నుంచి 300 మధ్య పూర్, 301 నుంచి 400 మధ్య వెరీ పూర్, 401 నుంచి 500 మధ్య AQI ఉంటే డేంజర్ వర్గాలుగా పరిగణించబడుతుంది.

Read Also:Balakrishna: నందమూరి తారక రామారావు అనే పేరు కేవలం వ్యక్తి పేరు కాదు.. ఒక చరిత్ర