Delhi vs Gujarat: విజయ్ హజారే ట్రోఫీ 2025 ఎలైట్ గ్రూప్–Dలో భాగంగా బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు గుజరాత్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ పోరులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 77 పరుగులు చేయగా.. కెప్టెన్ రిషభ్ పంత్ 70 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరితో పాటు హర్ష్ త్యాగి 40 పరుగులతో చివర్లో పరుగులు రాబట్టాడు. గుజరాత్ బౌలర్లలో విశాల్ జైస్వాల్ 4 వికెట్లతో మెరిశాడు.
AUS vs ENG 4th Test: మొదటి రోజే నేలకూలిన 20 వికెట్లు.. ఐదేసిన జోష్ టంగ్..!
ఇక 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు చివరివరకు పోరాడినా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. గుజరాత్ ఇన్నింగ్స్ లో ఆర్య దేశాయ్ (57), సౌరవ్ చౌహాన్ (49) కీలక ఇన్నింగ్స్ ఆడినా.. ఢిల్లీ బౌలర్లు చివరి దశలో కట్టడి చేయడంతో గుజరాత్ 47.4 ఓవర్లలో 247 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ, అర్పిత్ రాణా తలో రెండు వికెట్లు సాధించారు. బ్యాటింగ్‌లో 77 పరుగులు చేయడంతో పాటు ఫీల్డింగ్‌లో రెండు క్యాచ్‌లు పట్టిన విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Virat Kohli: కింగ్ ఎక్కడున్నా కింగే.. కొనసాగుతున్న కోహ్లీ వీరబాదుడు.. ఖాతాలోకి మరో రికార్డ్..!
