NTV Telugu Site icon

Dengue Alert : ఓ పక్క కరోనా.. మరోపక్క డెంగీ.. రాజధాని ఉక్కిరిబిక్కిరి

Musqito

Musqito

Dengue Alert : దేశ రాజధాని ఢిల్లీకి డెంగీ బెంగపట్టుకుంది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండంతో జనాలు భయపడుతుంటే.. ఇప్పుడు డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కేసుల సంఖ్య బీభత్సంగా పెరుగుతోంది. తాజా నివేదికల ప్రకారం ఢిల్లీలో డెంగ్యూ కేసులు 4,300 మార్కును దాటాయి. డెంగీ కారణంగా మరో రెండు మరణాలు సంభవించినట్లు ప్రభుత్వ అధికారులు ధృవీకరించారు. ఇప్పటివరకు డెంగీ కారణంగా మరణించిన వారి 7కు చేరింది. డిసెంబరు 19న, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) సమీక్షా ప్యానెల్ ద్వారా ఐదు మరణాలను నిర్దారించింది. ఈ మరణాలు సెప్టెంబర్-నవంబర్ మధ్యలో జరిగాయి.

Read Also: Pakistan Boat: భారీగా ఆయుధాలతో పాక్ ఫిషింగ్ బోటు.. అడ్డుకున్న అధికారులు

తాజాగా వెలువరించిన నివేదికలో డిసెంబర్ 1నుంచి 23 వరకు మొత్తం 4,361 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఎంసీడీ తెలిపింది. మొత్తం కేసుల్లో నవంబర్‌లో 1,420, అక్టోబర్‌లో 1,238, సెప్టెంబర్‌లో 693 కేసులు నమోదయ్యాయి. 2021లో నగరంలో డెంగ్యూ బారిన పడి 23 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదిక పేర్కొంది. 2015లో రాజధాని నగరంలో డెంగ్యూ విపరీతంగా వ్యాప్తి చెందింది. దీంతో అక్టోబర్‌లో కేసుల సంఖ్య 10,600 దాటింది.

Read Also:Gold Seized : కి‘లేడీ’ బంగారం అక్కడ పెట్టింది.. చెకింగ్ ను తప్పించుకుంది.. కానీ

డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు. ఇవి ఎక్కువగా జూలై , నవంబర్ మధ్య వ్యాప్తిచెందుతాయి. కొన్నిసార్లు డిసెంబర్ మధ్య వరకు వాటి వ్యాప్తి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధుల లక్షణాలలో అధిక జ్వరం, తలనొప్పి, దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి, ఇవి కోవిడ్ -19 మాదిరిగానే ఉంటాయి. డెంగ్యూ కారణంగా 2016, 2017లో పది మంది చొప్పున, 2018లో నాలుగు, 2019లో ఇద్దరు మరణించారు. దోమల నివారణకు ఎంసీడీ తగు చర్యలు చేపట్టినట్లు అధికారులు ప్రకటించారు.