Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!

  • CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని INDIA కూటమి డిమాండ్
  • జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ పిలుపు
  • అడ్డుకున్న పోలీసులు, రాహుల్ గాంధీ అరెస్ట్
Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi:ఢిల్లీలో బుధవారం కూడా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా, ఎన్నికల ప్రధాన కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నేతలు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు నిరసన తెలిపారు. విపక్ష ఎంపీలు ఢిల్లీలోని సాగర్ రత్న రెస్టారెంట్‌లో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించారు. లంచ్ అనంతరం విపక్ష ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన చేయాలని నిర్ణయించారు.

జంతర్ మంతర్‌కు బస్సులో ఇండియా కూటమి నేతలు తరలివెళ్లారు. పోలీసులు వీరిని అడ్డుకున్నారు. జంతర్ మంతర్ వద్ద భైఠాయించేందుకు ఇండియా కూటమి నేతలు ప్రయత్నించారు. రాహుల్ గాంధీనికి పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ప్రియాంకా గాంధీ రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. చివరకు పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను అరెస్ట్ చేసి, బలవంతంగా బస్సులోకి ఎక్కించారు. ఈక్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఢిల్లీ పోలీసులు తమను కొట్టారని ఇండియా కూటమి ఎంపీలు ఆరోపించారు. రాహుల్ గాంధీతో పాటు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రయిన్‌ను కూడా అరెస్ట్ చేశారు.