Site icon NTV Telugu

Congress: చిక్కుల్లో పడిన కాంగ్రెస్.. మండిపడుతున్న బీజేపీ

Delhi

Delhi

Congress: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కొత్త వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఢిల్లీలో మన్మోహన్‌ సింగ్‌తో పాటు జమ్మూకశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌ పోస్టర్లు వెలిశాయి. ఈ విషయాన్ని ఢిల్లీలోని బీజేపీ ఐటి సెల్ హెడ్ అమిత్ మాల్వియా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ ఫోటోపై భారతీయ జనతా పార్టీ విమర్శలు గుప్పించింది. అయితే, వెంటనే ఢిల్లీ పోలీసులు మండి హౌస్ సర్కిల్ దగ్గర నుంచి ఈ పోస్టర్‌ను తొలగించారు.

Read Also: Sandeshkhali: సందేశ్‌ఖాలీ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థికి భారీ భద్రత

కాగా, ఇందులో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ యాసిన్ మాలిక్‌ను విడుదల చేయాలనే డిమాండ్‌తో పాటు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు రాసి ఉంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో యాసిన్ మాలిక్ జీవిత ఖైదుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతని నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ను నిషేదిస్తున్టన్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్చి 15వ తేదీన నోటీసులు జారీ చేసింది. ఇవి కాకుండా మరికొన్ని ఉగ్రవాద గ్రూపులను కూడా నిషేధించారు. దేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో యాసిన్ మాలిక్ ఢిల్లీలో మన్మోహన్ సింగ్‌ను కలిశారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఈ పోస్టర్‌లోని చిత్రం ఈ సమావేశానికి సంబంధించినది.

Exit mobile version