NTV Telugu Site icon

Tear Gas Shells: రైతులను అడ్డుకునేందుకు ఏకంగా 30,000 టియ‌ర్ గ్యాస్ షెల్స్ ఆర్డర్..

Tear Gas

Tear Gas

Farmers Protest: రైతులు చేస్తున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు దేశ రాజధాని పోలీసులు భారీ ప్లాన్ కు సిద్ధం అయ్యారు. పంజాబీ రైతుల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సుమారు 30 వేల టియ‌ర్ గ్యాస్ షెల్స్‌ను ఆర్డర్ పెట్టినట్లు తెలుస్తుంది. కాగా, పంజాబ్ నుంచి వ‌స్తున్న వేలాది మంది రైతుల్ని.. హ‌ర్యానా బోర్డర్ దగ్గరే ఆపేస్తున్నారు. ఢిల్లీకి 200 కిలోమీట‌ర్ల దూరంలోనే కర్ణకుల్ని పోలీసులు నిలువరిస్తున్నారు.

Read Also: Anti Valentines Week : యాంటీ వాలంటైన్ వీక్.. ఈ రోజుల ప్రత్యేకత ఏంటో తెలుసా ?

ఇక, శంభు సరిహద్దులో ఉన్న రైతుల్ని చ‌ద‌రగొట్టేందుకు సెక్యూర్టీ టియ‌ర్ గ్యాస్‌ను ప్రయోగిస్తుంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నిర‌స‌న‌కారుల్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఢిల్లీ పోలీసులు ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే భారీ మొత్తంలో టియ‌ర్ గ్యాస్ షెల్స్‌ను తమ దగ్గర పోలీసులు భద్రపర్చుకున్నారు. మ‌రో 30 వేల షెల్స్ కోసం కొత్తగా ఆర్డర్ పెట్టారు. మధ్యప్రదేశ్ లోని టెక్నాపూర్ లో ఉన్న టియర్ స్మోక్ యూనిట్ నుంచి ఆ షెల్స్ కొనుగోలు చేయనున్నాట్లు సమాచారం. కాగా, గ్వాలియ‌ర్ నుంచి ఢిల్లీకి ఆ టియర్ గ్యాస్ షెల్స్ తీసుకోస్తున్నారు.

Read Also: Manickam Tagore: కిరణ్‌కుమార్‌ రెడ్డి వల్లే కాంగ్రెస్‌ బలహీనం..!

కాగా, రైతుల డిమాండ్లపై రైతు సంఘాలతో నిర్మాణాత్మక చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పేర్కొన్నారు. చర్చలకు సానుకూల వాతావరణం కల్పించి, నిరసనను విరమించుకోవాలని రైతులకు సూచించారు. కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల జరిగిన రెండు దశల చర్చలు అసంపూర్తిగా ముగియడంతో.. నేడు మరోసారి చర్చలకు ఇరుపక్షాలు సముఖంగా ఉన్నాయి. మూడో దశ చర్చలు ఇవాళ మధ్యాహ్నం చండీగఢ్‌లో జరగనున్నాయి.