Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ల జాబితా కేసు.. కోర్టులో ఢిల్లీ పోలీసుల రెండు నివేదికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ 1983లో భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే, అంటే 1980లోనే ఓటర్ల జాబితాలో ఆమె పేరు చేర్చబడిందన్న ఆరోపణలపై దాఖలైన ఫిర్యాదుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు శనివారం కోర్టులో రెండు నివేదికలను సమర్పించారు. ఈ ఆరోపణలను పరిశీలించడానికి ఓటర్ల జాబితాలో పేరు చేర్చడానికి సంబంధించిన కీలక రిజిస్ట్రేషన్ పత్రాలు ఇంకా లభ్యం కాకపోవడం కీలకంగా మారింది. ఈ వ్యవహారంపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వినోద్ జోషి గతంలో పోలీసులను కోరారు. తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 14కు వాయిదా వేసింది.
నవంబర్ 27 నాటి పోలీసు నివేదిక ప్రకారం.. ఫిర్యాదులోని ఆరోపణలు ఐపీ ఎస్టేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రానందున, తదుపరి చర్యల కోసం దానిని న్యూఢిల్లీ జిల్లాకు బదిలీ చేశారు. ఆ తర్వాత ఫిర్యాదును తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు శనివారం పోలీసులు కోర్టుకు తెలిపారు. మేజిస్ట్రేట్ మరిన్ని వివరాలు కోరడంతో, స్టేషన్ హౌస్ ఆఫీసర్ తీసుకున్న చర్యలపై మరో నివేదికను సమర్పించారు. 1980, 1983 సంవత్సరాలకు సంబంధించిన సోనియా గాంధీ ఓటర్ల జాబితా రికార్డుల సమాచారం కోసం గతంలో న్యూఢిల్లీ జిల్లా మేజిస్ట్రేట్‌కు నోటీసు పంపినట్లు రెండో నివేదిక తెలిపింది. ఆమె పేరు ఆ జాబితాల్లో ఉన్నట్లు వచ్చిన సమాధానంలో నిర్ధారణ అయింది.
Also Read
- Telangana IAS Transfers : తెలంగాణలో కీలక ఐఏఎస్‌ల బదిలీలు.. హెచ్ఎండీఏ, మెట్రోకు కొత్త బాస్‌లు
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. కరువు, తుఫాన్ల బాధిత రైతులకు రూ.2,459 కోట్ల పరిహారం..
- AP Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..
- Monkey Riding Dog : కుక్క వీపుపై కోతి స్వారీ.. కురవిలో ఆసక్తి రేపిన వింత దృశ్యం
అయితే, ఆమె పేరు చేర్చడానికి సంబంధించిన ఫారం-6, ఇతర పత్రాలు ఇంకా అందుబాటులో లేవని, వాటిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసు నివేదిక పేర్కొంది. తదుపరి విచారణలో భాగంగా సోనియా గాంధీకి భారత పౌరసత్వం మంజూరు చేసిన తేదీని కోరుతూ న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ఉన్న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఫారినర్స్ డివిజన్‌కు నోటీసు అందజేశారు.
ఆంటోనియా మైనో అలియాస్ సోనియా గాంధీకి 1983 ఏప్రిల్ 30న పౌరసత్వ ధృవీకరణ పత్రం జారీ అయినట్లు నివేదిక వెల్లడించింది. దర్యాప్తు జరిపితే మరిన్ని వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడైన న్యాయవాది వికాస్ త్రిపాఠి తరఫున న్యాయవాది నీరజ్ హాజరయ్యారు. గాంధీ ఓటర్ల జాబితా నమోదుకు సంబంధించిన పత్రాలను పోలీసులు గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, కోర్టు డిసెంబర్ 14న ఈ ఫిర్యాదును మళ్లీ విచారించనుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ల జాబితా కేసు.. కోర్టులో ఢిల్లీ పోలీసుల రెండు నివేదికలు..
-
Karthik Dandu: డిసెంబర్ 4న తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సినిమా రాబోతోంది..
-
Telangana IAS Transfers : తెలంగాణలో కీలక ఐఏఎస్‌ల బదిలీలు.. హెచ్ఎండీఏ, మెట్రోకు కొత్త బాస్‌లు
-
Dada Movie: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. కరువు, తుఫాన్ల బాధిత రైతులకు రూ.2,459 కోట్ల పరిహారం..
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!