NTV Telugu Site icon

Weather Update: ఆగస్టులోనూ మండుతున్న ఎండలు.. బయటికి వెళ్లాలంటే జంకుతున్న ఢిల్లీవాసులు

Delhi Weather

Delhi Weather

Weather Update: వేసవి కాలంలో వర్షాలు కురిస్తే తేమ శాతం పెరుగుతుంది. తేమతో శరీరానికి విపరీతంగా చెమట పడుతుంది. ఉత్తర భారతదేశంలోని ప్రజలు ముఖ్యంగా యూపీ వాసులు దీనిని జిగట వేసవిగా పిలుస్తారు. ఈ సమయంలో కూలర్లు, ఫ్యాన్లు కూడా ఎక్కువగా పని చేయవు. ఎందుకంటే వేడితో పాటు వాతావరణంలో చాలా ఆవిరి ఉంటుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. తేమ తగ్గుతుంది. అభివృద్ధి పేరుతో పచ్చని అడవులను నరికి కాంక్రీట్ జంగల్ ఏర్పాటు చేశారని.. దీని వల్ల భూమి గర్భంలోకి వర్షపు నీరు చేరడం లేదు. అందుకే ప్రస్తుతం వర్షం కురిసే బదులు.. సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు.

దేశవ్యాప్తంగా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. మరి కొన్ని ప్రాంతాల్లో కరువు విలయతాండవం చేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ప్రారంభం నుండి వాతావరణం చాలా అనూహ్యంగా మారుతూ ఉంది. ఈసారి కొన్ని పంటలు సమయానికి ముందే పండాయి. వేసవి త్వరగా వచ్చింది. జనవరి నుండి ఆగస్టు వరకు వాతావరణం అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మే-జూన్‌లో సామాన్యంగా ఎండాకాలం ఉంటుంది. అయితే ఢిల్లీలో నాలుగేళ్ల తర్వాత ఆగస్టు నెల చాలా వేడిగా ఉంది.

Read Also:Pawan Kalyan: అడుగడుగునా స్ఫూర్తినిచ్చిన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు!

వాతావరణ శాఖ (ఐఎండీ) నుంచి అందిన సమాచారం ప్రకారం.. నాలుగేళ్ల తర్వాత ఆగస్టులో ఉష్ణోగ్రత 38.1 డిగ్రీలకు చేరింది. అంతకుముందు 2019 ఆగస్టు 30న 38.2 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువ. గత శనివారం వర్షం నుండి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో తేమ జిగట వేడి పెరిగింది. సోమవారం గాలిలో తేమ స్థాయి 53 నుండి 88 శాతం వరకు ఉంది. జూలై 23 బుధవారం నాడు ప్రజలు ఈ తేమతో కూడిన వేడి నుండి పాక్షిక ఉపశమనం పొందవచ్చని ఇప్పుడు అంచనా వేయబడింది.

ఈ రోజు మేఘావృతమై ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 36 వరకు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల వరకు ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు ఆగస్టు 23న మేఘాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. అప్పుడు వాతావరణం వారాంతం వరకు పొడిగా ఉంటుంది. అంటే ఆగస్ట్ వాతావరణం ఇంకెన్ని రంగులు పులుముతుందో అనే ఊహాగానాలు సాగుతుండగా.. ఆ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు వరుణుడి ఆశీస్సుల కోసం జనాలు ఎదురుచూస్తున్నారు.

Read Also:APNGO: ఏపీఎన్‌జీజీవోగా మారిన ఏపీఎన్‌జీవో .. గెజిటెడ్‌ ఉద్యోగులు సభ్యులుగా ఉంటారు