Weather Update: ఆగస్టులోనూ మండుతున్న ఎండలు.. బయటికి వెళ్లాలంటే జంకుతున్న ఢిల్లీవాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Update: వేసవి కాలంలో వర్షాలు కురిస్తే తేమ శాతం పెరుగుతుంది. తేమతో శరీరానికి విపరీతంగా చెమట పడుతుంది. ఉత్తర భారతదేశంలోని ప్రజలు ముఖ్యంగా యూపీ వాసులు దీనిని జిగట వేసవిగా పిలుస్తారు. ఈ సమయంలో కూలర్లు, ఫ్యాన్లు కూడా ఎక్కువగా పని చేయవు. ఎందుకంటే వేడితో పాటు వాతావరణంలో చాలా ఆవిరి ఉంటుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. తేమ తగ్గుతుంది. అభివృద్ధి పేరుతో పచ్చని అడవులను నరికి కాంక్రీట్ జంగల్ ఏర్పాటు చేశారని.. దీని వల్ల భూమి గర్భంలోకి వర్షపు నీరు చేరడం లేదు. అందుకే ప్రస్తుతం వర్షం కురిసే బదులు.. సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు.
దేశవ్యాప్తంగా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. మరి కొన్ని ప్రాంతాల్లో కరువు విలయతాండవం చేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ప్రారంభం నుండి వాతావరణం చాలా అనూహ్యంగా మారుతూ ఉంది. ఈసారి కొన్ని పంటలు సమయానికి ముందే పండాయి. వేసవి త్వరగా వచ్చింది. జనవరి నుండి ఆగస్టు వరకు వాతావరణం అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మే-జూన్‌లో సామాన్యంగా ఎండాకాలం ఉంటుంది. అయితే ఢిల్లీలో నాలుగేళ్ల తర్వాత ఆగస్టు నెల చాలా వేడిగా ఉంది.
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
Read Also:Pawan Kalyan: అడుగడుగునా స్ఫూర్తినిచ్చిన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు!
వాతావరణ శాఖ (ఐఎండీ) నుంచి అందిన సమాచారం ప్రకారం.. నాలుగేళ్ల తర్వాత ఆగస్టులో ఉష్ణోగ్రత 38.1 డిగ్రీలకు చేరింది. అంతకుముందు 2019 ఆగస్టు 30న 38.2 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువ. గత శనివారం వర్షం నుండి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో తేమ జిగట వేడి పెరిగింది. సోమవారం గాలిలో తేమ స్థాయి 53 నుండి 88 శాతం వరకు ఉంది. జూలై 23 బుధవారం నాడు ప్రజలు ఈ తేమతో కూడిన వేడి నుండి పాక్షిక ఉపశమనం పొందవచ్చని ఇప్పుడు అంచనా వేయబడింది.
ఈ రోజు మేఘావృతమై ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 36 వరకు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల వరకు ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు ఆగస్టు 23న మేఘాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. అప్పుడు వాతావరణం వారాంతం వరకు పొడిగా ఉంటుంది. అంటే ఆగస్ట్ వాతావరణం ఇంకెన్ని రంగులు పులుముతుందో అనే ఊహాగానాలు సాగుతుండగా.. ఆ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు వరుణుడి ఆశీస్సుల కోసం జనాలు ఎదురుచూస్తున్నారు.
Read Also:APNGO: ఏపీఎన్‌జీజీవోగా మారిన ఏపీఎన్‌జీవో .. గెజిటెడ్ ఉద్యోగులు సభ్యులుగా ఉంటారు
తాజావార్తలు
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్‌వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..