Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi-NCR Heavy Rain: ఉత్తర భారత్‌లో రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో ఢిల్లీ-ఎన్సీఆర్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు విరుచుకుపడ్డాయి. నోయిడా, ఘాజియాబాద్, గుర్గావ్, ఫరీదాబాద్ ప్రాంతాలను ముంచెత్తిన వానల వల్ల జనజీవనం స్తంభించడమే కాకుండా రవాణా వ్యవస్థకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన 15 విమానాల రూట్లను అధికారులు దారి మళ్లించారు. ఇందులో 12 విమానాలను జైపూర్, రెండింటిని ఛండీగఢ్, మరో విమానాన్ని లక్నోకు తరలించారు. ఏవియేషన్ డేటా ప్రకారం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకల్లో సగటున 32 నిమిషాల జాప్యం జరుగుతుండగా, సుమారు 262 విమాన సర్వీసులపై ఈ ప్రభావం పడింది. వర్షాల ధాటికి దేశ రాజధాని పరిధిలో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.
గుర్గావ్లోని సోహ్రా రోడ్ ఇస్లాంపూర్ వద్ద సర్వీస్ లేన్‌లో దాదాపు రెండు అడుగుల మేర నీరు చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఢిల్లీలోని సంగమ్ విహార్, ఎంబీ రోడ్ పరిసరాల్లో వాహనాలు గంటల తరబడి చిక్కుకుపోవడంతో ఆఫీసులకు, ఎయిర్‌పోర్ట్‌కు అలాగే సాకేత్ కోర్టుకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘాజియాబాద్‌లోని NH-9 ఇండస్ట్రియల్ ఏరియా అండర్‌పాస్ వద్ద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రయాణాలను ఆపి రోడ్డు పక్కనే వేచి చూడాల్సి వచ్చింది. అయితే, ఉక్కపోతతో అల్లాడుతున్న ఢిల్లీ ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. ఇండియా గేట్, నోయిడా సెక్షన్లలో కురిసిన వర్షాలకు సంబంధించిన దృశ్యాలు ఆహ్లాదకరంగా మారాయి. రాబోయే రోజుల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ వ్యాప్తంగా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా ఫరీదాబాద్, గుర్గావ్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తరాఖండ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
- Suryakumar Yadav: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..
- 43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
తాజావార్తలు
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
-
Janvi : డర్టీ ఇమేజ్ నుంచి బయట పడాల్సింది పోయి ఇవేం పనులు జాన్వీ?
-
Beggar Woman’s Surprising Savings: జీవితాంతం వీధుల్లో భిక్షాటన చేసిన మహిళ.. మరణానంతరం బయటపడ్డ రూ.8.40 లక్షలు!
-
Violence Unlimited : సినిమా రంగానికి బాధ్యత లేదా?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!