Delhi Medical Student : చావు ఎవరికి ఎప్పుడొస్తుందో చెప్పడం చాలా కష్టం. ఈ మధ్య కాలంలో యువత గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు నిత్యం మీడియాలో వస్తూనే ఉన్నాయి. చావునుంచి తప్పించుకునేందుకు మనిషి శత విధాల ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ కొన్ని సార్లు చావును వెతుక్కుంటూ పోతున్నారు. అలాంటి ఘటన ఒకటి జమ్మూలో చోటు చేసుకుంది.
Read Also: Job Cheating : క్యాష్ కొట్టు.. జాబ్ పట్టు..
రంగుల పండుగ హోలీ సందర్భంగా స్నేహితుడిని కలిసేందుకని ఢిల్లీ నుంచి జమ్మూకి వెళ్లింది మెడికల్ స్టూడెంట్. పండుగను సంతోషంగా జరుపుకోవాలనుకుంది. కానీ తనకు తెలియదు తన చేతుల్లోనే మృత్యువాత పడతానని…… జమ్మూకు చెందిన ఓ మహిళ ఢిల్లీలో ఎండీ చేస్తోంది. హోలీ సందర్భంగా ఫ్రెండ్ ని కలిసేందుకని తన సొంత రాష్ట్రానికి వచ్చింది. పండుగరోజు అతడిని కలిసింది. ఆ సందర్భంగా వారి మధ్య వివాదం తలెత్తింది. దీంతో అతడు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన జమ్మూలోని జానీపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Read Also: LockDown : కరోనా లేదు.. కానీ కొచ్చిలో లాక్ డౌన్ ?
ఆ తర్వాత నిందితుడు కూడా కత్తితో పొడుచుకున్నాడని పోలీసులు తెలిపారు. అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని చెప్పారు. వారిద్దరు కలిసిన సందర్భంలో తలెత్తిన వివాదంలో కోపోద్రిక్తుడైన స్నేహితుడు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ హత్య మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.