Site icon NTV Telugu

Crime News: దారుణం.. కవల ఆడపిల్లలు పుట్టారని చంపేసిన తండ్రి

Delhi Crime

Delhi Crime

దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటే.. ఈ కసాయి తండ్రి మాత్రం కవల ఆడపిల్లలు పుట్టారని చంపేశాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదని.. ఈ క్రమంలో తండ్రి, అతని కుటుంబం ఆ పిల్లలను చంపి.. పూడ్చిపెట్టారు. కాగా.. ఈ ఘటనపై నిందితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో.. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి, న్యాయ ఆదేశాల మేరకు శిశువుల మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం నవజాత శిశువుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంజయ్ గాంధీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.

Read Also: IND vs AUS: భారత్, ఆసీస్ మ్యాచ్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దయితే ఆ జట్టుకు పండగే..!

దీంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. నిందితుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. పూజా సోలంకి అనే మహిళ ఇటీవల ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. జూన్ 1న.. పూజ తన బిడ్డలతో సహా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది. ఆమె రోహ్‌తక్‌లోని తన తల్లి ఇంటికి వెళ్లాలనుకుంది. కానీ ఆమె భర్త నీరజ్ సోలంకి తన కారులో శిశువులను ఎక్కించుకుని వెళ్లిపోయాడు. మరొక కారులో తల్లిని ఫాలో కావాలని చెప్పాడు. అయితే మధ్యలో నీరజ్ రూటు మార్చాడు. అయితే.. పూజ సోదరుడు నీరజ్‌కు ఫోన్ చేస్తే.. కాల్ కనెక్ట్ కాలేదు. అనంతరం.. శిశువులను నిందితుడు హత్య చేసి పాతిపెట్టాడు. ఈ ఘటనకు పాల్పడింది నీరజ్ కుటుంబీకులేనని పూజా సోదరుడు గుర్తించారు. కాగా.. పూజ 2022లో నీరజ్‌ని వివాహం చేసుకుంది. ఎఫ్‌ఐఆర్ లో.. పూజ అత్తమామలు కట్నం కోసం ఆమెను వేధించేవారని తెలిపింది.

Exit mobile version