Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Delhi Liquor Scam Charge Sheet Updates

Delhi Liquor Scam : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక అంశాలు వెలుగులోకి

Published Date :December 16, 2022 , 3:21 pm
By Gogikar Sai Krishna
Delhi Liquor Scam : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక అంశాలు వెలుగులోకి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్ లో స్కాం కుట్ర తదితర అంశాలను బయటపెట్టింది. సీబీఐ ఆరోపించిన అభియోగాలను కోర్టు ఆమోదించింది. ముడుపులు నగదు రూపంలో హవాలా మార్గంలో తరలించినట్లు గుర్తించింది. అభిషేక్ బోయిన్‌పల్లి 20 నుంచి 30 కోట్ల రూపాయల నగదును హవాలా మార్గంలో తరలించినట్లు ఛార్జిషీటులో వెల్లడించింది సీబీఐ. ఆ డబ్బంతా అడ్వాన్స్‌గా 2021 జులై, సెప్టెంబర్ మధ్య కాలంలో ముట్టజెప్పినట్లుగా సీబీఐ పేర్కొంది. రూ.30 కోట్లను దినేష్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు అందజేసినట్లు తెలిపింది. దక్షిణాది ప్రాంతానికి చెందిన మద్యం ఉత్పత్తిదారుల తరపున అభిషేక్ బోయిన్‌పల్లి వ్యవహారం నడిపినట్లు తెలిపింది.
Also Read : S Jaishankar: పెరట్లో పాములు పెంచితే పొరుగువారినే కాదు.. వారిని కూడా కాటేస్తాయి..

శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట శ్రీనువాసులు రెడ్డి సౌత్ గ్రూప్‌ను కంట్రోల్ చేశారని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. సీఐబీ దాఖలు చేసిన తొలి ఛార్జిషీటును ఆమోదించి నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో కీలక అంశాలను ప్రస్తావించింది. మద్యం ఉత్పత్తిదారులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు ఏ ఇద్దరి మధ్య ఎక్కడా గుత్తాధిపత్యం కానీ సమూహాలకు కానీ లబ్ధిచేకూర్చకూడదనే విధానాన్ని రూపకల్పన చేసినట్లుగా తెలిపింది. మద్యం పాలసీ రూపకూల్పన జరుగుతున్న సమయంలోనే నిందితులు కుట్రకు పాల్పడినట్లు తేటతెల్లచేసింది. 2021 జులై, సెప్టెంబర్ మధ్యలో రూ.30 కోట్లను అభిషేక్ బోయిన్‌పల్లి.. దినేష్ అరోరాకు అందజేశారని తెలిపింది. మొత్తం నగదును విజయ్ నాయర్‌కు అందజేసినట్లుగా స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యులను ప్రభావితం చేసేందుకు హోల్‌సేల్ దారులకు 12 శాతం లాభాలు ఆర్జించేలా అందులో తిరిగి 6 శాతం అభిషేక్ బోయిన్‌పల్లికి తిరిగి వచ్చేలా కుట్ర చేశారని పేర్కొంది.
Also Read : Makeup Stay Longe: మేకప్ త్వరగా పోతోందా? ఇలా చేయండి!

హోల్‌సేల్ వ్యాపారంలో వచ్చే లాభాల్లో రామచంద్రన్ పిళ్లై నుంచి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ముత్తా గౌతమ్‌కు రూ.4.75 కోట్లుకు అందాయయని.. అతని అకౌంట్ నుంచి అభిషేక్ బోయిన్‌పల్లికి రూ.3.85 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లుగా తెలిపింది. అంతేకాకుండా గౌతమ్‌కు చెందిన మీడియా సంస్థలకు కూడా కొంత డబ్బు బదిలీ అయిందని స్పష్టం చేసింది. మొత్తం ఏడుగురు నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పేర్కొంది. కొందరు ప్రజా సేవకులు, ఇతర సంస్థలతో కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించింది. అడ్వాన్స్ కింది ముడుపులు, కిక్ బ్యాక్స్ అందాయని తెలిపింది సీబీఐ. చట్ట విరుద్ధ లక్ష్యాలను సాధించేందుకు కుట్రకు సంబంధించిన అంశాలను ఛార్జిషీటులో సీబీఐ పొందుపరిచింది. సముచితమైన మౌఖిక, డాక్యుమెంటరీ ఆధారాలను కూడా దర్యాప్తులో భాగంగా దర్యాప్తు సంస్థలు సేకరించాయని సీబీఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వారిపైనా, పేర్లు లేనివారిపైనా కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఛార్జిషీటులో వెల్లడించింది సీబీఐ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • cbi Court
  • delhi liquor scam
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Arshdeep Singh Expensive Over: ఒకే ఓవర్‌లో 10 బంతులు, 24 రన్స్.. అర్ష్‌దీప్ సింగ్‌తో మాములుగా ఉండదు మరి!

  • US-Iran Talks: “అమెరికాను నమ్మలేం”.. చర్చల ముందు ఇరాన్ బిగ్ ట్విస్ట్..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Origin of Gold: బంగారం ఎలా పుట్టిందో తెలిసిపోయింది.. సముద్రం అడుగున ఉన్న ‘గోల్డ్ ఫ్యాక్టరీ’కి దారి ఇదే!

  • Peddi: స్పెషల్ “హీరోయిన్” కోసం ఫలించని ప్రయత్నాలు.. మరింత ఆలస్యం!

ట్రెండింగ్‌

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions