ఢిల్లీలో యమునా నది నీటిమట్టం మళ్లీ పెరిగింది. సోమవారం ఉదయం నుంచి క్రమంగా పెరుగుతోంది. దీంతో యమునా నది ఇంకా ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో వరద ముప్పు కొనసాగుతూనే ఉంది. అంతేకాకుండా మంగళవారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వరదల్లేని రోడ్ల మార్గాలను ట్విట్టర్‌లో తెలియజేస్తున్నారు. మహాత్మా గాంధీ మార్గ్ నుండి రాజ్‌ఘాట్ మీదుగా ఐపి ఫ్లైఓవర్ మరియు శాంతి వాన్ మధ్య రహదారి వాహనాల రాకపోకల కోసం తెరిచినట్లు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే రోడ్డుపై బురద ఉండటంతో వాహనాదారులు జారి పడే అవకాశముందని.. జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు.
Google Security: మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ అయిందా..? ఇలా చెక్ చేసుకోండి..!
అంతేకాకుండా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు అక్కడి జనాలకు ఓ సలహా ఇచ్చారు. ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు మా సలహాను తప్పక పాటించాలని చెప్పారు. వాటితో పాటు.. ఎమర్జెన్సీ నంబర్లు కూడా జారీ చేశారు. ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ నంబర్లను సంప్రదించవచ్చని కోరారు. ఐపీ ఫ్లైఓవర్‌ను ఇరువైపులా తెరిచినట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ప్రజలు సెరైకాలే ఖాన్ ద్వారా కాశ్మీరీ గేట్‌కు వెళ్లవచ్చన్నారు. సలీంఘర్ బైపాస్ మరియు రింగ్ రోడ్ బైపాస్ ద్వారా ISBTకి వెళ్ళవచ్చని ట్విట్టర్ లో తెలిపారు.
Health Tips: రోజూ పొద్దున్నే దీన్ని తింటే.. 60 ఏళ్లు వచ్చినా వయస్సు ఎంతో కనిపెట్టలేరు..!
ఢిల్లీలో జూలై 10 సాయంత్రం 5 గంటలకు యమునా నది 205.33 మీటర్ల ప్రమాద స్థాయిని దాటింది. జూలై 13న 208.66 మీటర్ల చారిత్రక నీటి మట్టానికి చేరుకుంది. 1978 సెప్టెంబర్ లో నెలకొల్పబడిన 207.49 మీటర్ల రికార్డును బద్దలు కొట్టింది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరద పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా.. ఢిల్లీలోని 6 జిల్లాల్లోని వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల నుండి దాదాపు 26,401 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 21,504 మంది ప్రజలు 44 శిబిరాల్లో నివసిస్తున్నారు. తాత్కాలిక సహాయక శిబిరాలతో పాటు పాఠశాలలు మరియు కమ్యూనిటీ సెంటర్లలో ఉన్నారు.