మ్యాచ్ అనంతరం మైదానంలో రోబో చంపక్ చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. క్రికెటర్లతో ఆడుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంది. ఎవరేం చెప్పినా చేస్తూ.. మాట వింటుంది. ఆ మధ్య సునీల్ గవాస్కర్ ఈ చిట్టి రోబోతో చేసిన సందడి నెట్టింట వైరల్ గా మారింది. ధోనీ, కేఎల్ రాహుల్, అయ్యర్, పాండ్యా ఇలా ప్రతిఒక్కరు ఆ చిట్టి రోబోకి ఫ్యాన్ అయిపోయారు. ఈ రోబో ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్ల ఫొటోలు, వీడియోలు తీస్తూ సందడి చేస్తోంది. కానీ బీసీసీఐని చిక్కుల్లో పడేసింది. ఏకంగా ఢిల్లీ హైకోర్టు నుంచి నోటీసులు పంపేలా చేసింది.
Also Read:Simhachalam Tragedy: ప్రమాద స్థలిని పరిశీలించిన బొత్స బృందం
నిజానికి ఈ రోబో డాగ్ తప్పేమీ లేదు. బీసీసీఐ ఫ్యాన్ పోల్ ద్వారా దానికి చంపక్ అన్న పేరు పెట్టింది. అయితే ఆల్రెడీ కిడ్స్ కు సంబంధించి చంపక్ అనే మ్యాగ్జైన్ ఉండటంతో.. ఆ మ్యాగజైన్ నిర్వాహకులు ఆ రోబోపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పర్మిషన్ తీసుకోకుండా చంపక్ అనే పేరుని వాడుకుని వాళ్ళ ట్రేడ్‌మార్క్ ని ఉల్లంఘించారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై స్పందించిన ఢిల్లీ కోర్టు జూలై 9 లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐని కోర్టు ఆదేశించింది. మరి బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.