NTV Telugu Site icon

Puja Khedkar: ప్రస్తుతానికి అరెస్ట్ చేయవద్దు.. పూజా ఖేద్కర్‌ కు ఢిల్లీ హైకోర్టు ఉపశమనం..

Puja

Puja

Puja Khedkar: మహారాష్ట్ర కేడర్‌ నుంచి తొలగించబడిన ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ పై తాజాగా ఢిల్లీ హైకోర్టు తక్షణ ఉపశమనం కలిగిస్తూ ఆమె అరెస్టుపై స్టే విధించింది. ఆగస్టు 21 వరకు ఖేద్కర్‌ను అరెస్టు చేయవద్దని., ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫిర్యాదు మేరకు సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో మోసం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఖేద్కర్‌ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. UPSC ఫిర్యాదు తర్వాత, పూజా ఖేద్కర్‌ ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఖేద్కర్ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ ను దాఖలు చేశారు.

Reporters Begging: ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వీధుల్లో భిక్షాటన చేసిన జర్నలిస్టులు..

ఆగస్టు 1న, ఖేద్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు దర్యాప్తు పరిధిని పెంచాలని ఢిల్లీ పోలీసులు UPSCని కోరింది. నకిలీ డాక్యుమెంట్లతో ఉద్యోగం సంపాదించేందుకు యూపీఎస్సీలో ఎవరైనా ఖేద్కర్‌కు సహాయం చేశారా.? అనే కోణంలో విచారణ జరపాలని కోర్టు పేర్కొంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 (CSE-2022) తాత్కాలికంగా సిఫార్సు చేయబడిన అభ్యర్థి పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్ తాత్కాలిక అభ్యర్థిత్వాన్ని UPSC రద్దు చేసింది. అలాగే ఆమె భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షలు, ఎంపికల నుండి శాశ్వతంగా డిబార్ చేయబడింది. CSE-2022 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఖేద్కర్ దోషిగా తేలిన ఖేద్కర్ పత్రాలను పరిశీలించిన తర్వాత UPSC ఈ నిర్ణయం తీసుకుంది. షోకాజ్ నోటీసును కూడా జారీ చేశాడు.

Paris Olympics 2024: హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన మహిళ.. వీడియో వైరల్‌!