Kejriwal: కేజ్రీవాల్‌ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు ఏర్పాట్లు చేయాలని పిటిషన్.. లక్ష జరిమానా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi High Court: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన వార్తలను నిషేధించాలని కూడా పిటిషన్లో డిమాండ్ చేశారు. ఈ పిల్ ను కోర్టు తిరస్కరించడమే కాకుండా పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.
Read Also: Madhyapradesh : ముందు గుడికి దండంపెట్టాడు.. తర్వాత బాంబులు వేశాడు
Also Read
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
కాగా, శ్రీకాంత్ ప్రసాద్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, కేబినెట్ సభ్యులతో కేజ్రీవాల్ మాట్లాడేందుకు వీలుగా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని జైలు డీజీని ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించి శ్రీకాంత్ ప్రసాద్ అనే న్యాయవాదికి రూ.లక్ష జరిమానా కూది విధించింది. ఎయిమ్స్ ఖాతాలో జమ చేయాలని పిటిషనర్‌ను కోరారు. పిటిషనర్‌ను కోర్టు మందలించడంతో పాటు పలు ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది.
Read Also: Komatireddy Venkat Reddy: మాది RR కాదు.. మీది AA.. మోడీకి కోమటిరెడ్డి సెటైర్
ఇక, ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా, రాష్ట్రపతి పాలనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయకుండా మీడియాను నిలిపివేయాలని పిటిషన్లో శ్రీకాంత్ ప్రసాద్ డిమాండ్ చేశారు. దీనిపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఎమర్జెన్సీ విధించాలా లేక మిలటరీ పాలన విధించాలా అని ప్రశ్నించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21వ తేదీ నుంచి జైలులో ఉన్నారు. ఆరోపించిన మద్యం కుంభకోణంలో అరెస్టైన కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలని పట్టుదలగా ఉన్నారు. తమ అధినేత సీఎం పదవికి రాజీనామా చేయరని, జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది.
తాజావార్తలు
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!