Site icon NTV Telugu

Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. ఇలా ఎందుకు జరిగిందని కేంద్రానికి ప్రశ్న

Delhihighcourt

Delhihighcourt

దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతటి గందరగోళం ఎందుకు తలెత్తిందంటూ తీవ్రంగా మందలించింది. ఇక ఇండిగో సంక్షోభం సమయంలో ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు ఎలా అనుమతించబడ్డాయని న్యాయస్థానం నిలదీసింది. అసలెందుకు ఈ పరిస్థితి తలెత్తిందని కేంద్రాన్ని అడిగింది.

ఇది కూడా చదవండి: JD vance-Usha: రెస్టారెంట్‌లో జేడీవాన్స్-ఉషా వాన్స్ ఘర్షణ.. ఫొటో వైరల్!

వందలాది విమానాలు ఒకేసారి ఎందుకు క్యాన్సిల్ అయ్యాయని కేంద్రాన్ని మందలించింది. ఇక విమాన ఛార్జీలు రూ.40,000 పెంచకుండా నిరోధించడంలో విఫలమైనట్లుగా తప్పుపట్టింది. సంక్షోభ సమయంలో ఇతర విమాన సంస్థలు ఎందుకు ధరలు పెంచేశాయని ధర్మాసనం అడిగింది. కేంద్రం తీసుకున్న చర్యల జాబితాను అదనపు సొలిసిటర్ జనరల్ చదివి వినిపించారు. అయితే ఈ సంక్షోభం ఎందుకు తలెత్తిందంటూ ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. పైలట్లు ఎందుకు ఎక్కువ పనిభారంతో బాధపడుతున్నారో.. దానిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో కూడా కేంద్రాన్ని ప్రశ్నించింది.

ఇది కూడా చదవండి: Gujarat: ఓ అమ్మాయిపై ఇద్దరి స్నేహితులు మక్కువ.. చివరికేమైందంటే..!

‘‘మీ ప్రయత్నాలను మేము అభినందిస్తున్నాము. ప్రశ్న ఏమిటంటే.. అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది విమానాశ్రయాల్లో వ్యక్తిగత ప్రయాణీకులు చిక్కుకుపోవడం మాత్రమే కాదు. ఈ ప్రశ్న ఆర్థిక వ్యవస్థకు నష్టం. ఇది ప్రయాణీకులకు వేధింపులు. ప్రయాణీకులకు పరిహారం చెల్లించడానికి ఏ చర్యలు తీసుకున్నారు? సర్వీస్ ప్రొవైడర్ల ఉద్యోగులు బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చూసుకోవడానికి ఏ చర్యలు తీసుకున్నారు?.’’ అని కేంద్రాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది.

గత వారం నుంచి దేశంలో ఇండిగో సంక్షోభం తలెత్తింది. వందిలాది విమానాలు రద్దు అవ్వడంతో దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం నెలకొంది. వేలాది మంది ప్రయాణికులు తిండి తిప్పలు మానేసి విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాశారు. ఇక లగేజీలతో ఎయిర్‌పోర్టులు డంప్ యార్డులుగా మారాయి. ఇక హఠాత్తుగా ప్రయాణాలు ఆగిపోవడంతో ప్రయాణికులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Exit mobile version