Delhi: తెల్లవారుజామున కలకలం.. కార్మికుల గుడిసెల్లో భారీ అగ్నిప్రమాదం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఉద్యోగ్ భవన్ సమీపంలోని కార్మికులు నివసించే స్లమ్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ ప్యానెల్లో మంటలు మొదలై, అక్కడి నుంచి సమీపంలోని తాత్కాలిక గుడిసెలకు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమై ఘటనాస్థలికి 20 ఫైరింజన్లను తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఉదయం 5:10 గంటల ప్రాంతంలో మంటలను పూర్తిగా చుట్టుముట్టగా.. 5:30 గంటలకు పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విద్యుత్ ప్యానెల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అవి సమీపంలోని కార్మికుల నివాస గుడిసెలకు వ్యాపించాయి. అయితే అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- France: మ్యూజిక్ ఫెస్టివల్లో షాకింగ్ ఘటనలు.. సిరంజిలు గుచ్చి యువతులపై అత్యాచారాలు..
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు!
- Heavy Rains: తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు.. రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు!
ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితమే ఢిల్లీలోని తకియా కాలే ఖాన్ ప్రాంతంలోని బాల్మీకి బస్తీలో కూడా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ వెనుక ఉన్న స్లమ్ క్లస్టర్లో సోమవారం అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఆ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే మొదట 7 నుంచి 8 ఫైరింజన్లను పంపించగా.. మంటల తీవ్రత పెరగడంతో మొత్తం 24 ఫైరింజన్లను రంగంలోకి దింపారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ డివిజనల్ ఆఫీసర్ ముకేశ్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చామని, ప్రాథమిక సమాచారం మేరకు ఎలాంటి ప్రాణనష్టం నమోదుకాలేదని ఆయన చెప్పారు.
బాల్మీకి బస్తీ ప్రాంతంలో నివాస గుడిసెలతో పాటు ప్లైవుడ్ నిల్వ కేంద్రాలు, ఇతర గిడ్డంగులు ఉండటంతో భారీగా కలప సామగ్రి మంటలకు ఆహుతై అగ్ని వేగంగా వ్యాపించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
No Releases : ఈ సినిమాల విడుదలకు మోక్షం ఎప్పుడు..?
-
France: మ్యూజిక్ ఫెస్టివల్లో షాకింగ్ ఘటనలు.. సిరంజిలు గుచ్చి యువతులపై అత్యాచారాలు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు!
-
AI: ఏఐ తీసుకొస్తున్న భారీ ముప్పు.. నెలల్లోనే అంతా స్మాష్..?
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!