Site icon NTV Telugu

Delhi: ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనర్ అనుమానాస్పద మృతి.. హత్యా లేక ఆత్మహత్యా!

Suicide

Suicide

Delhi: ఢిల్లీలోని ఓ ఫ్యాషన్ డిజైనర్ ఇంట్లో గురువారం శవమై కనిపించింది. ఆత్మహత్యగా అనుమానిస్తున్న పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన 26 ఏళ్ల మహిళ గురువారం ఉదయం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లోని తన ఇంట్లో శవమై కనిపించింది. మృతి చెందిన మహిళను దీపికగా గుర్తించారు.

Also Read: Rajya Sabha: మణిపూర్ ఘటనపై చర్చకు విపక్షాల పట్టు.. రాజ్యసభలో గందరగోళం

ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్న పోలీసులు.. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. కేసు నమోదు చేసి మృతుల కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ సమయంలో, సూసైడ్ నోట్ దొరికిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. అసలేం జరిగిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. దీపిక గత కొంత కాలంగా ఫ్యాషన్‌ డిజైనర్‌గా రాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె సూసైడ్ చేసుకుందా.. ఎవరైనా హత్య చేసి సూసైడ్‌గా చిత్రీకరిస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version