CJP: సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు క్రైమ్ బ్రాంచ్ బిగ్ షాక్..!
- సీజేపీ నాయకులు రాంకా, దాస్‌లకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ షాక్..
- జంతర్ మంతర్ నిరసనలకు సంబంధించి సమన్లు జారీ..
- గురువారం మధ్యాహ్నం హాజరుకావాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP:కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షాక్ ఇచ్చారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సంబంధించిన నమోదైన రెండు కేసుల్లో వారి వాంగ్మూలాలు నమోదు చేసేందుకు సమన్లు జారీ చేసింది. సీజేపీ సభ్యుడు అజింక్యా షిండేకు కూడా సమన్లు జారీ చేుసినట్ల ఢిల్లీ పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు దాస్, రాంకాలు రాజౌరీ గార్డెన్‌లోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు కోరారు. బుధవారం బెయిల్ లభించడంతో వీరిద్దరు తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఇద్దరిపై రెండు కేసులు..
అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లపై జంతర్ మంతర్ నిరసనకు సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో, మరొకటి కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన స్థలం నుంచి తొలగించినప్పటికీ.. దాస్, రాంకాలతో సహా సీజేపీ సభ్యులు అక్కడికి ప్రవేశించేందుకు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు. బారికేడ్లు దాటి, ఓ ప్రైవేట్ సంస్థ ప్రాంగణం ద్వారా ఆ ప్రాంతంలోకి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.
Also Read
కన్నాట్‌ప్లేస్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించడం, ఇంట్లోకి అక్రమంగా ప్రవేవించడం, నేరపూరిత కుట్రకు సంబంధించిన ఆరోపణలు నమోదైనట్లు తెలుస్తోంది. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో నమోదైన రెండో ఎఫ్ఐఆర్లో ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటకం కలిగించడం, వారిపై దాడి చేయడం, పోలీసులకు గాయాలు కలిగించడం వంటి ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.
7 రోజుల తర్వాత బెయిల్..
అంతకుముందు, అక్టోబర్ 13న జంతర్ మంతర్ వద్ద ఆంక్షల్ని ఉల్లంఘించి ప్రవేశించినందుకు ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందుగా 5 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత దీనిని మరో రెండు రోజులు పొడగించింది. బుధవారం వీరిద్దరికి సంబంధించిన బెయిల్ కేసు బుధవారం ఢిల్లీ హైకోర్టు చేరింది. హైకోర్టు సీజేపీ నేతల్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. వేరే ప్రదేశాల్లో నిరసనకు అనుమతి ఉన్నప్పటికీ, ఆంక్షలు విధించిన జంతర్ మంతర్ వద్దకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది. అంతకుముందు శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని ‘‘పీస్ బాండ్’’పై సంతకం చేసి ఉల్లంఘించినట్లు కోర్టు గుర్తించింది. చివరకు బుధవారం సాయంత్రం స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
తాజావార్తలు
-
CJP: సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు క్రైమ్ బ్రాంచ్ బిగ్ షాక్..!
-
Gold Rates Down: పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..
-
Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
-
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సోనియాగాంధీ.. ఫస్ట్ పోస్ట్ ఏం చేశారంటే..!
-
WTC Points Table: సౌతాఫ్రికాతో టెస్ట్ ఓడినా నంబర్-1 స్థానంలోనే ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా, భారత్ స్థానాలు ఎంతంటే..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!