Delhi liquor scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor scam case) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎట్టకేలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరు అయ్యారు. అయితే, కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.15 వేల వ్యక్తిగత బాండ్ తో పాటు రూ.1 లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కోర్టు నుంచి అరవింద్ కేజ్రీవాల్ వెళ్లిపోయారు.
Read Also: Haiti : హైతీ నేరస్థుల ఆధీనంలో 90 మంది భారతీయ పౌరులు
అయితే, కేజ్రీవాల్‌కు దర్యాప్తు సంస్థ (ఈడీ) జారీ చేసిన సమన్లను పాటించలేదన్న ఫిర్యాదులపై ఈరోజు హాజరు కావాలని రోస్ అవెన్యూ కోర్టు (మేజిస్ట్రేట్ కోర్టు) కోరింది. అరవింద్ కేజ్రీవాల్ తరఫున ఇద్దరు న్యాయవాదులు రమేష్ గుప్తా, రాజీవ్ మోహన్ వాదనలు వినిపించారు. ఇక, అరవింద్ కేజ్రీవాల్ కోర్టుకు వెళ్లే క్రమంలో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కోర్టు చుట్టూ ఉన్న పలు మార్గాలను దారి మళ్లించారు. దీంతో పాటు ఆయా మార్గాల్లో వచ్చే ప్రజలు సకాలంలో రావాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అయితే, ఇప్పటికే ఈడీ అధికారులు ఢిల్లీ సీఎంకు 8 సార్లు సమన్లు జారీ చేసిన కేజ్రీవాల్ వెళ్లలేదు..
Read Also: MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు పూర్తి.. రౌస్ అవెన్యూ కోర్టుకు..!
ఇక, తాము జారీ చేసిన సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదని ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో మరోసారి పిటిషన్ వేయడంతో.. తాజాగా ఆయన రోస్ అవెన్యూ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అనేక సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ వారు దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావడం లేదని ఈడీ ఆరోపించింది. కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదనలకు కోర్టు ఏకీభవించడంతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.