Site icon NTV Telugu

Arvind Kejriwal: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్.. ఈ రోజు ఢిల్లీలో.. రేపు కేంద్రంలో..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని.. కాలం చాలా శక్తివంతమైనదన్నారు. ఎప్పటికీ అధికారంలో ఉంటారని ఎవరైనా అనుకుంటే అది జరిగే పని కాదన్నారు. ఈరోజు ఆప్ ఢిల్లీలో అధికారంలో ఉందని.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందన్న ఆయన.. రేపు కేంద్రంలో మేమే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.

Pakistan PM: పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకుంది.. భారత్‌తో చర్చలకు సిద్ధం

ఇదిలా ఉండగా.. ఫిన్‌లాండ్‌లో ఢిల్లీ ఉపాధ్యాయుల శిక్షణా పర్యటనను అడ్డుకున్నందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రైమరీ స్కూల్ టీచర్లను ఫిన్‌లాండ్‌కు పంపించి శిక్షణ ఇవ్వాలనే ఢిల్లీ ప్రభుత్వ ప్రణాళికను లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. దీనిని లెఫ్టినెంట్ గవర్నర్ తిరస్కరించారు. తనకు కావలసింది కాస్ట్-బెనిఫిట్ విశ్లేషణ అని నొక్కి చెప్పారు. దీనిపై అరవింద్‌ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాస్ట్-బెనిఫిట్ విశ్లేషణ అడగడానికి మీరు ఎవరు? ప్రజలు నన్ను ఎన్నుకున్నారు.’ అని మండిపడ్డారు.

Exit mobile version